Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవం అంకురించి అంతరించే
ఆ క్షణాన్ని నేనే-
యావత్ మానవ జాతి
అనుభవించిన వేదన
సమస్తం నాలో ఉంది-
మనిషిలో గూడుకట్టుకున్న
అంతులేని ఆకాంక్షల్ని మోస్తున్నది నేనే-
మానవజాతి మరిచిపోయిన
చారిత్రక రహస్యాలన్నీ
నిబిడీకతమైనాయి నాలో-
ద్రవించి,ఘనీభవించడం లో
ఈ సష్టి పడిన సంఘర్షణని నేనే-
నాలోనే ప్రపంచం పుట్టి,నశిస్తున్నది
విశ్వరూపిణిని నేను-
స్థబ్దత,వేగమూ రెండూ నేనే
మహానందమో, సంఘర్షణో
ఆ రెండు భావాల కొనసాగింపును నేనే-
జీవం అంతమై,మళ్ళీ అంకురించే
ఆ క్షణమే నేను-
-(ఒరియా మూలం):డా.స్నేహప్రవ దాస్
-(తెలుగుసేత) : మూర్తి కెవివిఎస్
7893541003