Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల పాగాల సైనికులు
పార్లమెంటు వీధుల్లో
పాగా వేసిండ్రు
కవాతు చేస్తున్న రైతు సైనికులు
ఈదర గాలులలో
హలాల కత్తులు చేబూని
యుద్ధం చేస్తుండ్రు...
హస్తినాపురం రోడ్డు వెంట
టెంటు నాట్లు నాటిండ్రు
కార్పోరేట్ల చుట్టాలయిన చట్టాలను
బుట్ట దాకలు చేయడానికి
విత్తనాయుధాలను పూనిండ్రు...
నాగళ్లు మనుషులను నరకడానికని
అవాకులెందుకు?
హలాల మొననలతో మొండి పోరాటం
జనాల కడుపు నింపడానికి కదా !
విత్తనం తల యెత్తి మొలకెత్తితే
ఉగ్రవాద మెట్లయితది ?
కషీవలుడి కషి అంతా
జాతి పొట్ట నింపడానికి కదా !
పిల్లా జెల్లలతో
రైతు చేస్తున్న పోరాటం
రాజ్యం మీద కుట్ర ఎట్రయితది ?
గుడారం కింద నాట్లు వేయడం
రాజ్యం తీరు పట్ల
అసమ్మతి తెలుపడం కదా !
తిండి గింజెలకు పట్టిన కార్పోరేట్ చెదలు ఖతం కాక తప్పదు
రైతన్న చిరునవ్వుతో తిరిగి ఏరువాక చేయడం తప్పదు.
- విలాసాగరం రవీందర్,
94409 32934