Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అకస్మాత్తుగా
ఆవేశాన్ని
అక్కున చేర్చుకుని
అర్రులు సాచే ఆకాశంలాంటిదది.
అర్థమయ్యే ప్రశ్నలకు కూడా
అనర్థాల ముసుగువేసి
వెంట తీసుకెళ్తుందది.
రాలిపడిన జ్ఞాపకాలను
కాసేపు
నిటారుగా నిలబెట్టి
వాటికి నీడవుతుంది.
అందలమెక్కిన
అవకాశాల్ని
నోటకరుచుకుని, వెళ్ళి
నిర్లక్ష్యపు అలల క్రింద
పాతిపెడుతుంది.
కాసేపు పూలు పూస్తుంది
మరి కాసేపు మోడైపోతుంది.
ఇదీ నేనంటే
అనేలా చేస్తుందది.
ఏదీ తెలియనిదది.
అన్నీ తెలిసినదీ అదే.
కోపం ఒళ్ళెక్కి
గాయాలు చేస్తున్నప్పుడు
కట్లు తెంచుకొచ్చే
మాటల ప్రవాహానికి
మౌనాన్ని అడ్డుకట్టగా వేస్తుంది.
కొన్ని ఏళ్ళనుండి
నీలోపల పేరుకుపోయిన
చెత్తను క్షణాల్లో
కడిగి పారేస్తుంది.
నిన్ను నీకు
కొత్తగా చూపించే
సరికొత్త అద్దమది.
ఒక దశ్యాన్ని కళ్ళకు చూపిస్తుంది.
మరో దశ్యాన్ని తాను చూస్తుంది.
అది-
గదులు లేని ఇల్లు
వింతరంగుల హరివిల్లు.
గాలిని గోళ్ళతో రక్కి
తన గొప్పతనాన్ని
చాటుకుంటూ ఉంటుంది.
యుద్ధాల్ని, నిశ్శబ్దాల్ని
పిడికిలిలో దాచుకున్న
అదశ్యలోకాలసమూహమది.
- తిరునగరి శరత్ చంద్ర
6309873682