Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరు
బొటనవేలు ట్యాగ్ మీదికి చేరుకొంటుంది
బతుకులో
కోల్పోయిన చల్లదనాన్నంతా
పార్దీవ దేహం అనుభవిస్తూ ఉంటుంది
అందరి
బతుకు పుస్తకం చివరి అట్టమీద
అందమయిన బ్లర్బ్ ఉంటుంది.. కానీ ..ఎందుకో
అంతిమ యాత్ర లోనే అది అందరికి అర్ధమవుతుంది
వీసెల్లో
మొదలయిన బాల్యం
కేజీల్లో కుదురుకుంటుండగా ....
ఎల్బీల్లో ఎలిజీ పాడుతుంది...
ఓ మధ్యతరగతి.. తరం... స్వరం
సక్సెస్ అయిన సినీ ఫార్ములాలా... సాగిసాగి
పుటుక్కున తెగిపోతుంది...
తాను మోసిన సంస్కతికి
తన సంతానమే బోర్డు తిప్పేస్తూ ఉంటుంది
కురిసిన వర్షం
చూరుచివర జారీ జారీ మళ్ళీ చినుకైనట్టు
అతి మాములుగా
ఒకటో రెండో కనుకొనకుల్లో
వేలాడి వేలాడి జారిపడే దుఃఖపు చినులై పోతారు
ఏ డీలు లేకుండా
డాలరు దోసిళ్ళ సందులలోంచి జారిపడుతుంటారు
జీవితపు లిట్మస్ టెస్టెంటే
లేటెస్ట్ ఐ ఫోను బ్రాండెడ్ టీ షర్ట్, షార్టు
అనుకోని మురిసిపోయి ....
రిటైర్మెంటంటే
బుజం ఆసరాగా నిలబడాలని తెలియక
నిలబడాల్సిన అవసరమే లేదనుకొని
మంచు పెట్టెలో ముగ్ద (మోహన)రూపమై పోతారు
యధాలాపంగా
బొటనవేలు ట్యాగుమీద పేరుబలం పేరుకు పోతుంది
- మువ్వా శ్రీనివాసరావు,
9848823288