Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముళ్ళనీ రాళ్ళనీ
లెక్క చేయని పాదాలు
ఇప్పుడు రాజ్యం కంట్లో నలుసులు!
మంటికీ మింటికీ మధ్య
అనుబంధాలు అల్లే చేతులు
కంటక ప్రభువుల కాలిలోన ముళ్ళు!
పండించడమే
యోగంగా భావించే హదయాలు
చెవిటి పాలకుల చెవిలో జోరీగెలు!
ఢిల్లీ పరిసరాలిప్పుడు
వణుకుతున్నవి చలితో కాదు
హాలికులెత్తిన పిడికిళ్ళతో!
వాయిదాలు వేసే
చర్చలనెప్పుడు నమ్మొద్దు
అవి నడి నెత్తిన రాలే పిడుగులు!
ఈ ప్రభువులు మోసే పల్లకీల సేవ
కాలం ప్రతిబింబిస్తూనే ఉంది
పతనాలకు ముహూర్తాలుండవు మిత్రమా!
నేనిప్పుడే కలగంటున్న
గోధుమ గడ్డి మంటల్లో
నల్ల చట్టాలు కాలుతున్న దృశ్యం!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261