Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రైతే చాలు
చంద్రుడిని చుక్కలనూ చూస్తూ
భూమి చలాకిపిల్లలా తిరుగుతుంది
తెల్లారితే చాలు
ఎర్రటి సూర్య బింబాన్ని స్పర్శిస్తూ
బద్ధకం పోయి వెచ్చగా
సూర్యకాంత పుష్పంగా వికాసం!
పున్నమ వెన్నెలకైతే
భూమి స్వర్ణమయ కలువ కలువ !
మంచు కురుస్తుంటే భూమికి
దోమ తెర వేసుకున్నంత
చిలిపి పిల్లల ఆట !
చల్లగాలి హాయిగా వీస్తుంటే
భూమికి గంపెడంత ఆనందం
దగడు చల్లబడ్డట్లే !
చిన్న చిన్న పెద్ధ పెద్ద ఆనందాలే
భూమి తల్లి జీవనానికి ఆగకుండా
ఆగం కాకుండా
శ్రామికంగా బలం భ్రమణం !
భూమిలా మనం ఆనందాలతో
దిగులు దూరంగా ఉందాం -
మనగుండెకు ఎంతెంత సంతోషమో
- మలుపు మలుపులో
పెద్దతల్లి భూమి మనకు
ఆశల పాఠం చెపుతుంది
కొత్త పాట పాడించి
ఆటలు ఆడిస్తుంది హారు !
మన అందరి తల్లుల స్ఫూర్తి
- కందాళై రాఘవాచార్య