Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్ళిప్పుడు
ఎగుడుదిగుడు శాసనాలను
చదునుచేసే పనుల్లో వున్నారు
వట్టిపోయిన
చట్టసభల్లో
జవజీవాల్ని నింపే
సరికొత్త వంగడాల్ని
సాగు చేస్తున్నారు
పంట పొలాల్లో
పాతుకుపోయి
నేల సారాన్నంతా
పిప్పిచేస్తున్న పిచ్చి మొక్కల్ని కలుపుతీసేందుకు
మునుం పట్టారు
తరాలుగా
అంటుకుంటున్న
పంట తెగుల్లను అరికట్టే
పురుగు మందును
పిచికారీచేసే
పనిలో నిమగమై వున్నారు
సరిహద్దుల కావల
రచిస్తున్న
తెరవెనుక కుట్రల్ని
తూర్పార పడుతున్నారు
కల్లంలో
గింజల్ని కొల్లగొట్టే
ఇంటి దొంగల్ని
కలుగుల్లోంచి వెలుపలికి లాగి
పొలిమేరల్లో
దిష్టిబొమ్మల్ని చేసి
వేలాడదీస్తున్నారు
మట్టిగొట్టే వ్యూహాలెన్ని
ప్రయోగిస్తున్నా
పట్టెడన్నం సష్టించడానికి
ఎప్పటికప్పుడు
పుట్టెడు కష్టాల్ని మోస్తున్నారు
ఎంతైనా
భూమిపుత్రులు గదా
మనిషిని నిలబెట్టే
మహాత్కార్యంలో
వాళ్ళిప్పటికీ
అప్రమత్తంగానే వున్నారు.
- కొండి మల్లారెడ్డి