Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవడు లేడు ఏకాశి లేదు
గడ్డి లేదు గాదం లేదు
ఎకరం నికరం లేదు
కలిమి లేని కార్తి బలిమే
కన్నీళ్ళు కౌలుకు తీసుకున్నట్టయింది
సాల్లమీద సాల్లిపోతుంటే
సాలు తప్పిన కాలం
సోయి తప్పి తిరుగుతుంది
వానపడి పాణం పోసే
వానమీద వాన పడి ప్రాణం తీసే
వడ్లు మునిగి గుడ్లు తేలేశే
మబ్బులు కమ్మినయో
కండ్లు కమ్మినయో
మెదలు ఎదలు తొక్కి పోతున్నయి
నోటికాడికి వచ్చి
కాటికాడికి గుంజే
నాగలి ఆడక నకిరం పట్టిన కాలం
మొకాళ్ళమీద తల పిందెలేసింది
వొకొచ్చి బుశ్విపొయ్యక
కంకి బుగులు పడ్డది
జొన్న కర్రల జోడి వదిలి
పిట్ట బుర్రుమంది
గుండె పగిలి కార్తి గూడు పెట్టుకుందిల
నడిపోడ ఓరి జుంపాలోడా
పొద్దుని లేపి సాగనంపి
పొద్దు గూకితివ
కాళ్ళ కడియాలు కరిగి
చేతుల మీదికి వచ్చినయి
మడి పడి మీద
పొద్దు ముట్టని పచ్చి అయ్యింది
ఏ పంట కంటతడవ లేదని
గోడలు మెత్తినట్టు
కండ్లు మెత్తితే బాగుండు
శాలువాలు కప్పుకొని
జండాలు కప్పుతుండ్రు
ఇచ్చింది బతుక్కు కాదు
కట్టెకు బట్టకు
పడమటిల్లు పాటిగడ్డయింది
- మునాను వెంకట్
9948158163