Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి అవసరాన్ని
సృష్టించి నేరం వైపుగా అడుగులు వేస్తే
తప్పెవరిది
చూపుడు వేలు ప్రశ్నిస్తే
మిగతావేళ్ళు సమాజన్ని చూపెడతాయి
ప్రతి అసహాయత అవసరాన్ని అందుకోలేక
చతికలబడుతూ
తప్పని రాజీతత్వాన్ని
అలవర్చుకున్నప్పుడు
దిక్కులు తెలియక మోసం తక్కెడలో
తూగితే తప్పేంటి
కోట్ల సొమ్ముని బుక్కిన
బకాసురలకి రాచ మర్యాదలు చేసి
బయటికి పంపించి
చిన్న చేపలని వలేసి
దేశాన్ని బ్రస్టుపట్ట్టించిన పాలకులని
నిలదీస్తే నేరమా ?
కాలాలు పగపట్టి
పాలకులు నడ్డి విరగొట్టి
రైతు బతుకుల్ని ఉరికంబలకేక్కించి
పండగ చేసుకొనే లత్కోరు
పాలసీ లను తిప్పి కొడితే
ఉడుకుమోతుతనం ఎందుకు
కూడు గుడ్డ నీడ
ఈ దేశం లో అందని ద్రాక్షలే అయినా
మౌనం గా శిక్ష ని అనుభవిస్తూ
ప్రజలు ఇన్నాళ్ళు
ఇక పై సాగదంటు ఉద్యమ బాట పడితే
మీ ఆటలు సాగవని కాల్చి పారేస్తున్నారు
మేలు చేయని ఏ ప్రబుత్వాలు
మనుగడ సాగించని ఉదంతాలు కొకల్లలు
చరిత్రను తవ్వండి తెలుస్తాయి
ఇప్పుడు దగ పడ్డా గొంతులన్ని సవరించి
ఎలుగెత్తి పాడుతున్నాయి
మోసం పునాదుల పై కట్టిన
నీతిమాలిన చరిత్రలను తిరగారాడానికి
ఒక్కటి గా బయలుదేరుతున్నాయి
- పుష్యమీ సాగర్,
9010350317