Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృదయానికి...
గాయపుతడి తగిలినప్పుడల్లా
అక్షరాలను అందంగా అలంకరించడం
నాకేమీ కొత్తకాదు
మనసు భారమై హదయం కంపించినప్పుడు
కంటిచెమ్మ ఒత్తిని అక్షరాలతో వెలిగిస్తుంటాను
అస్పష్టమైన భావాలు పదచిత్రాలై
నా మునివేళ్లతో స్పష్టత నేర్చుకుంటాయి
గతించిన చేదు జ్ఞాపకాలను సరదాకోసం కూడా
ఇప్పుడు తవ్వదలచుకోలేదు
ఎందుకంటే...
సంఘర్షణావస్త కాలంలో
హదయశిలపై చెక్కిన చేదుసంఘటనలు
చెరిగిపోయేవికావుజి
వాటిని...
ప్రస్తుతానికి బేరీజు వేయడంలో
నేను అశక్తురాలిని
అప్పుడప్పుడూ....
నది ఉప్పొంగి ప్రవహించినట్లు
ఆనందపు అలలు హదిని తాకి
మురిపించి మరిపింపజూస్తాయి
వాటిని పదిలపరుచుకోవాలనుకోను
ప్రశాంతమైన సముద్రంలో సునామీ
భీభత్సం సష్టించినట్లు
వెల్లివిరిసిన ఆనందం ప్రళయం లో చిక్కుకొని
క్షణాల్లోఅగాధం లో కూరుకుపోతుంది
చేతిరాతలన్నీ తలరాతలైతే బాగుండు
నాకు మీరు...
మీకు మేము ...
కలిస్తే మనం అని
ఓదార్పునిచ్చే ఆత్మీయతా శాసనం రాసిపెట్టేదాన్ని!!
- జయంతి వాసరచెట్ల,
9985525355