Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనమొకడిని మానవుడని పిలవాలంటే
అతడెన్ని బాటలమీద పయనించి వుండాలి
తెల్ల పావురమొకటి చల్లని ఇసుకలో నిద్రించాలంటే
అది యెన్ని సంద్రాలను అధిగమించాలి
నిషేధానికి గురయ్యేముందు శతఘ్నిగుండ్లు
ఎన్ని సార్లు గాల్లో దూసుకుపోవాలి
మిత్రుడా!
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
పర్వతమొకటి సాగరం వైపు కొట్టుకుపోయే ముందు
అది ఎన్ని సంవత్సరాలు మనగలుగుతుంది
స్వేచ్ఛ దొరకడానికి ముందు కొందరు
ఎన్నేళ్లు బ్రతకగల్గుతారు భారంగా?
చూడనట్టు నటించే ముందు
ఎన్ని సార్లు మనిషి తన తలను తిప్పుకోగలడు
మిత్రుడా!
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
చుక్కల తెరువును చూడాలంటే
ఎన్ని సార్లు పైకెత్తాలి తలను
ఆర్తజన శోకాన్ని వినాలంటే
ఎన్ని చెవులుండాలి చెప్పు
లక్షల మంది మతినొందినట్టు గ్రహించాలంటే
ఎన్ని జననమరణాలను అనుభవించాలి
మిత్రుడా!
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
సమాధానం గాలికి ఎగిరిపోతోంది
- ఆంగ్ల మూలం : బాబ్ డిలన్
అనువాదం : ఎలనాగ