Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక తెలుగువాడు హిందీ సినిమా హీరోపై ఇంగ్లీషులో రాసిన పుస్తకమిది. అయినా ఇది తెలుగు వారిదే. అన్ సంగ్ హీరోగా మరుగున పడిన ఒక తెలుగువాడి ఘనకీర్తిని వెలుగులోకి తెచ్చిన అరుదైన గ్రంథమిది. తెలుగు వారికి సినిమాలంటే తెలియని కాలంలో హిందీ చిత్రసీమలో హీరోగా విజయయాత్ర చేసిన పైడి జైరాజ్ నాయుడు జీవన విశేషాల సచిత్ర సమాహారమిది.
మనకు రాజ్‌కపూర్ నుండి కరీనా దాకా తెలుసు, దేవానంద్ నుండి ఆమీర్ ఖాన్ దాకా తెలుసు. అయితే ఈ క్రమంలో మరింత వెనక్కి వెలితే దొరికిపోయే మణిపూస భారత చలనచిత్ర హారంలో చేరకుండానే మిగిలిపోయింది. ధగధగ మెరువాల్సిన పైడి జైరాజ్ సినీ అధ్యాయం ఎందుకో విస్మరణకు గురయ్యింది. మనం మహానటులని చెప్పుకుంటున్న వాళ్ళను తన వేలు అందించి నడిపించిన జైరాజ్ చరిత్రలో వారి వెనుకాలే ఆగిపోయాడు. ప్రచారం పట్ల ఆయనకు ఆసక్తి లేకపోవడమా లేక అన్ని వత్తుల్లాగే సినిమా ఒకటి అని తేలిగ్గా తీసుకోవడమా కారణమేదైనా పైడి జైరాజ్ తెలుగువారికి దూరమైన మాట వాస్తవం. కరీంనగర్లో పుట్టిన జైరాజ్‌పై తెలుగువాడిగా కాకుండా తెలంగాణ ముద్ర పడిందా.. నెల్లూరుకు చెందిన తెలుగువాడైన హిందీ హాస్యనటుడు జానీ లీవర్ అప్పుడప్పుడు తెలుగు పత్రికల్లో కనబడతాడు. మరి తెలుగు పత్రికలకు కనీసం సినిమా పత్రికలకు జైరాజ్ నిజంగానే తెలియకుండా ఉన్నాడా... ఇప్పుడు వీటికి జవాబులు వెతికే అవసరం లేదు. దాచేస్తే దాగని సత్యాలుగా ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.
తెలంగాణ స్పహ ఒక తేజోమయ కళా, సాంస్కతిక వైభవానికి బాట వేసింది. మన సొంత గడ్డమీది వారు ఎక్కడెక్కడున్నారు, ఏమేమి సాధించారు, గుర్తింపుకు నోచుకోనివారెవరు అనే కోణంలో భారీ అన్వేషణే సాగుతోంది. ఆ తవ్వకాల్లో బయటపడ్డ ఆణిముత్యమే పైడి జైరాజ్. విచిత్రమేమిటంటే ధర్మాత్మ, షోలే, షాన్, డాన్ వచ్చిన కాలంలో సినిమాలు చూసిన వాళ్లకు ఆ వద్ధ నటుడి పేరు జైరాజ్ అని తెలుసు కాని ఆయన తెలుగువాడిని, కరీంనగర్లో పుట్టినాడని ఇక్కడివారెవరికి తెలియదు. జైరాజ్ స్వయంగా ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టాక కూడా దానికి ఏ పత్రిక తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ రచయితల, పరిశోధకుల కషి వల్ల ఇప్పుడు జైరాజ్ పరిచయమక్కరలేని కీర్తిమంతుడయ్యాడు.
అయినప్పటికీ ఆయన కార్యక్షేత్రం బొంబాయి కావడంవల్ల జైరాజ్ గురించి తెలిసింది తక్కువే. ఎంత తెలుసుకోవాలని ఉన్నా పని కట్టుకొని ఆ మహానగరం వెళ్లి ఆయన తోటివారిని, సహనటీనటులను, కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడవలసిందే. ఆయన హిందీ సినిమాల్లో హీరోగా వెలిగిన కాలం 1930 నుండి 1965 అయినందున చెప్పేవారెవరు, ఎక్కడున్నారు అనేది సాగరలోతు ప్రశ్న. అందుకే కొన్నేళ్లుగా జైరాజ్ గురించి కొన్ని కథనాలు వచ్చినా అవి పైపై తడుములాటలే. ఎట్టకేలకు జైరాజ్ పై ఒక సమగ్ర సంపూర్ణ గ్రంథం రావడం హర్షణీయం, తెలుగు వారికి, సినీప్రేమికులకు ఇదొక విలువైన బహుమతిగా భావించాలి. పేరుకే ఇది ఇంగ్లీష్ పుస్తకం కాని జైరాజ్ పై అభిమానముంటే భాష అడ్డంకే కాదు.
పుస్తకం పేరు టు బాంబే విత్ లవ్, పి.జైరాజ్స్ లైఫ్, టైమ్స్ అండ్ ఫిలిమ్స్. రచయిత టి. శ్రీకాంత్. 2001 నుండి క్రియేటివ్ లింక్స్ అనే సొంత డిజైనింగ్ కంపెనీ నడుపుతున్నాడు. 2005లో శ్రీకాంత్ అలనాటి హీరో కాంతారావు జీవన విశేషాలతో 'అనగనగా ఒక రాకుమారుడు' అనే పుస్తకం రాశారు. దానికి గుర్తింపుగా ఆయనకు 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినీ పుస్తక రచయితగా నంది అవార్డును బహుకరించింది. 2010లో రచయితకు పైడి జైరాజ్ పై పుస్తకం తేవాలనే ఆలోచన మొదలైంది. 2018 దాకా సమాచారం కోసం పలుమార్లు ముంబై వెళ్లామని, రెండేళ్లు పుస్తక రచన, రూపకల్పనకు పట్టిందని రచయిత తన మాటగా రాశారు. శ్రీకాంత్ ఆసక్తి, శ్రమ, పట్టుదల, నైపుణ్యం ప్రతి పేజీలోను కనిపిస్తుంది. 260 పేజీల ఈ పుస్తకంలో ఫోటో లేని పేజీ లేదు. ఒక్కో పేజీలో ఒకటికి మించిన ఫొటోలున్నాయి. కళాకారుడు జీవితం కాబట్టి అక్షరాలకన్నా ఫొటోలే ఎక్కువ మాట్లాడుతాయి.
రచయిత పుస్తకాన్ని జైరాజ్ లైఫ్ అండ్ టైమ్స్, జైరాజ్స్ ఫిలిమ్స్, జైరాజ్స్ ఫిల్మోగ్రఫీ అనే మూడు భాగాలుగా విభజించారు. మెదటి భాగం చాలా ఆసక్తిగా సాగుతుంది. సౌకర్యవంతమైన, ఉన్నత విద్యావంతుల కుటుంబంలో కరీంనగర్లో 28 సెప్టెంబర్ 1909లో పుట్టిన జైరాజ్ లండన్ వెళ్లి ఇంజనీరింగ్ చదవవలసిన వాడు. చిన్న అలకతో ఇరువై ఏళ్ల వయసులో 15 ఏప్రిల్ 1929 లో బొంబాయి చేరాడు. నాలుగు పేజీల తర్వాత 1 మే 1929 నాడు జైరాజ్ రూపంలో కొత్త యాక్షన్ హీరో వచ్చాడు అని ఉంది. మధ్యలో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు అని రాశారు కాని రెండు తేదీల మధ్య ఉన్నది 15 రోజులే. ఈ విభాగంలో జైరాజ్ సినీ జీవితంలోని ఎత్తుపల్లాలు, విజయాలు, వేసిన పాత్రలు, చిన్న పెద్ద అంశాలు క్రమపద్ధతిలో సరళమైన రీతిలో వివరించబడింది. సుమారు 75 పేజీల ఈ కథనం ఈ పుస్తకానికి గుండెకాయ. జైరాజ్‌పై వచ్చిన వ్యాసాల్లో ఆయన హిందీ సినిమాల్లో చేరడానికి బొంబాయి వెళ్లాడని ఉంటుంది. అయితే బొంబాయి వెళ్ళాక కూడా ఆ ఆలోచన తనకు లేదు. పని వెతుకులాటలో అలా అవకాశం చిక్కిందని ఈ పుస్తకంలో ఉంది. మరాఠీ రచయిత ముకుంద్ బాపట్ జైరాజ్ కోరికపై ఆయన జీవిత విశేషాలను రాసినా జైరాజ్ మరణం వల్ల అది అముద్రితంగానే ఉండిపోయింది. దీనిలోని సమాచారం ఈ అధ్యాయ రచనకు ఎంతో తోడ్పడిందని శ్రీకాంత్ 'కత్ఞతలు'లో ప్రస్తావించారు.
రెండో విభాగంలో జైరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 95 సినిమాల వివరాలున్నాయి. నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్, పూణే నుండి సేకరించిన సినీ పత్రికల ప్రకటనలు, పోస్టర్లు ఎడమ పేజీ నిండుగా కుడివైపు ఆ చిత్ర కథ, పత్రికల సమీక్షలు ఉన్నాయి. బొమ్మలు ఆకర్షణీయంగా సమాచారం సమగ్రంగా ఉన్నాయి. మూడో విభాగం 1930 నుండి 1995 దాకా జైరాజ్ నటించిన మూకీ టాకీ సినిమాల జాబితా ఉంది.
శ్యామ్ బెనెగల్ ముందుమాట, ముకుంద్ బాపట్ 'ఆరంభం' రచయితకు అభినందనలు అందించాయి. తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కతిక విభాగాలు ప్రాంతీయ విస్మరిత అంశాల పునప్రతిష్టకు కషి చేస్తున్నాయి. రవీంద్రభారతిలో మినీ హాల్ కు జైరాజ్ పేరు పెట్టారు. ఈ విభాగాలు రచయిత కషిని గుర్తించే అవకాశముంది. పుస్తకం రాకపై జైరాజ్ కుటుంబ సభ్యుల స్పందన లేఖలు లేకపోవడం ఓ వెలితిగా కనబడుతుంది.
జైరాజ్ తమవాడని కొంతకాలంగా కరీంనగర్ రచయితలు ఆయనపై పలు రూపాల్లో స్పందిస్తున్నారు. పొన్నం రవిచంద్ర నిర్వహణలో జైరాజ్‌పై ఇన్విన్సిబుల్ హీరో అనే డాక్యమెంటరీ వచ్చింది. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇది ప్రదర్శింపబడింది. నోయిడా ,కలకత్తా మరియు షాంఘై (చైనా) ఫెస్టివల్ లలో అవార్డులు గెలుచుకుంది.
చివరి రోజుల్లో తన జ్ఞాపకాలను పుస్తకంగా తేవాలన్న జైరాజ్ కోరికను ఆయన మరణానంతరం 111 జన్మదిన కానుకగా తీర్చిన తెలుగు బిడ్డ శ్రీకాంత్. ఈ అసామాన్య కషికి రచయిత తగిన గుర్తింపుకు అర్హుడు, అభినందనీయుడు.
- బి.నర్సన్, 9440128169