Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు రైతు రైతు ఈ దేశానికి తిండి రైతు
రైతు రైతు రైతు మన దేహానికి కండ రైతు
విత్తు రైతు మొక్క రైతు మొక్కవోని బలం రైతు
జలం రైతు ఫలం రైతు ప్రశ్న పంటరాశి రైతు
పార్లమెంట్ పరిమళాల తోటమాలి రైతు
పరుగెత్తే దేశానికి జీవిగంజి చెలిమె రైతు||రైతు||
తిన్నింటీ వాసాలను లెక్కించే మోసాలను
బువ్వ తినే కంచంలో ఉమ్మేసే కుట్రలను
తడిగుడ్డతో ఈదేశం గొంతు కోసే దుర్మార్గుల
పసిగట్టిన తల్లి రైతు పదునెక్కిన తండ్రి రైతు
రైతు రైతు రైతు రగిలె భారతాన రైతు
రైతు రైతు రైతు డిల్లీ చుట్టుముట్టె రైతు ||రైతు||
ఎక్కడైన అమ్ముకోను దళారీ కాదు రైతు
ఎంతైనా దాచుకోను వ్యాపారి కాదు రైతు
రైతన్నలదే ధర నిర్ణయమనె ఆశ చూపి
సర్కారు మార్కెట్లను చంపేసే ద్రోహులపై
రంకెలేస్తు లేచినాడు రైతు రణం చేస్తు
కొడవళ్ళ నాగళ్ళను కొలిమిల రాజేస్తూ ||రైతు||
వ్యవసాయ చట్టాలు కసాయోళ్ళ చుట్టాలు
అంబానీ అదానీల కాళ్ళకింద పట్టాలు
మోసకారి మోడీగారు వేషాలాపండి చాలు
కోండ్రలేసి నీ ప్రభుతను దున్నుతారు రైతులు
రైతు రైతు రైతు జాతీయ జెండ రైతు
రైతు రైతు రైతు ఇండియా గుండె రైతు ||రైతు||
- ఎం. విప్లవకుమార్