Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు
వాళ్ళు తాకట్టు పెడితేనే
తల్లడిల్లిన దేశం
ఇప్పుడు వీళ్ళు
తెగనమ్ముతుంటే
తెల్ల ముఖం వేస్తోంది!
వీళ్ళు స్పష్టంగానే ఉన్నారు
ఉక్కు సంకల్పంతో
తెగేసి చెబుతూనే ఉన్నారు
మనమే
చెవుల్లో దూది కూరుకుంటున్నాం!
రాజ్యాలకు కనికరం ఉండనట్లే
వ్యాపారాలకు సెంటిమెంట్లుండవు!
అంతా మారినట్లే
పాలకులూ సేల్స్ మేనేజర్లు అయ్యుండ్రు
ఎంత అమ్మితే
అంత దేశభక్తి!
రహదారుల్నీ
వాయి మార్గాల్ని వేలం వేశాక
ఆఖరి ఋణం తీర్చుకోడానికి
శవం వెంట నడవాలన్నా
కాసులు వెదజల్లాల్సిందే!
పోనూపోనూ
మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు
జేబు తడుముకోపలసిందే!
ఆవులనమ్మీ
పాలను కొనడం వాళ్ల దేశభక్తైతే
చూస్తూ మౌనంగా ఉండటం
మనదీ దేశ ద్రోహమే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261