Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఔను
నేను అమెరికా విప్లవం లో పాల్గొన్నా
ఫ్రెంచి విప్లవ సారథి అనుచరుడినీ నేను
నేను పుట్టిన తేదీ నాకు తెలీనప్పుడు
ఏమైనా వాగొచ్చు
మతం మత్తు లో మునిగి తేలుతున్న జనం
చరిత్ర పాఠాలు శుద్ధ దండుగ అని ప్రకటిస్తే నే
ఏం జరగలే
వాస్తవ చరిత్రే మరుగున పడి
ఎవడు ఏది వాగితే అదే చరిత్రగా ప్రాచుర్యం
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు
పోరాటమే ఎరుగని సంస్థ చేతిలో
రాజ్యాన్ని పెట్టేస్తే
బంగ్లా విముక్తేం ఖర్మ
యాడికైనా డేకొచ్చు
మెదడులో మట్టి ని నింపేసి
పబ్బం గడుపు కుంటున్న రాజ్యం
రాజే అబద్ధాలు పేలుస్తుంటే
విస్తు పోతున్న ప్రపంచం
ఏమిటిది అని ఒక్క ప్రశ్న జాడ లేదు
దేశం నిండా గుడ్డి భక్తి
కుంటి సాకుల నేపథ్యం
అందుకే నేనూ ఒక అడుగు ముందేసి
విప్లవాల్లో పాల్గొన్నా అంటున్నా
అప్పుడైనా ఈ జనం
విప్లవాల స్వరూపం కోసం వెతుకుతారేమో
సెర్చ్ ఇంజన్లల్ల
కళ్ళు తెరుస్తారేమోననే చిన్ని ఆశ
నాలో మిణుకుమంటుంటే......
- గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201