Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ( బోల్డ్ నెస్ కలిగిన బ్యూటిఫుల్ కథలు)
కొత్తతరం జీవితాల కొత్త యాతనలను సహజమైన రీతిలో ఆవిష్కరించే ప్రయత్నమే అపర్ణ తోట తోట బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కథలు నేటితరం స్త్రీల ఆలోచనా ధోరణులు మానసిక పో రాటాలు తెలియజేస్తాయి. ఈ సంపుటిలోని చాలా కథలు. ఆధునిక స్త్రీలు అనుభవిస్తున్న సున్నితమైన సమస్యలను రచయిత్రి కథా వస్తువులుగా తీసుకున్నారు. టీ కప్పుల్లో తుఫాను లాంటి ఈ సమస్యలు వారి జీవితాల్లో సృష్టించే అలజడిని ఒక పక్క తెలియజేస్తూనే దాన్నితట్టుకొని నిలబడగల ధీరలుగా స్త్రీ పాత్రను సృష్టించిన తీరులో వీరు స్త్రీ పక్షపాతిగా కనిపిస్తారు. ఈ కథల ద్వారా ఆధునిక మహిళ ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనగలిగే మానసిక శక్తి కలిగి వుందనే వాస్తవాన్ని నిరూపించారు.
ఈ కథా సంపుటిలోని మొదటి కథ అతడు ఆమె. ఒక ఆఫీసులో పని చేసే స్త్రీ పురుషుల మధ్య జనించే చిన్న ఆకర్షణ కథ¸ వస్తువు. ఇందులో పాత్రలకు పేర్లు పెట్టకుండానే అతడు ఆమె అంటూ సంబోధిస్తూ కథను కొనసాగించడం మంచి ప్రయోగం... పెళ్ళి అనే బంధంతో ఒకరిపై ఒకరికి కంట్రోల్ పెరగిపోవడాన్ని ఇష్టపడని ఆమె పెళ్లిలోని మొనాటనిని బ్రేక్ చేయాలనుకొని తన కొలిగ్‌తో హాటల్లో గడపడం... కానీ తాను చేస్తున్న పని సరైనదా? కాదా? అనే ద్వైదీభావంతో సతమతమయ్యే ఆమె మానసిక స్థితిని సహజంగా చిత్రించారు. ఒక్కోసారి జీవితంలో స్తబ్దత స్త్రీలకు ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఆ స్తబ్దత నుంచి బయటపడటానికి చేసే సాహసం దానితో పడే సంఘర్షణ పాఠకులను ఆలోచింపజేస్తుంది. చివరికి అతను కూడా తన భర్త లాగే ఉన్నాడు. కొత్తేముంది అనడంలో స్త్రీలలో అవ్యక్త భావాల్ని ఏ పురుషుడు గ్రహించ లేడు అనే వాస్తవాన్ని గుర్తుకు తెస్తుంది. ఇందులోని మరో మంచి కథ ఏడో ఋతువు. ప్రతి రుతువు ప్రకృతిలో మార్పు తెచ్చినట్టుగానే దీపా మాధురీలు ఒకరి జీవితంలో మరొకరు రావడం మానసికంగా దగ్గర కావడం ఒకరికొకరు ఆలంబనగా మారడం జరుగుతుంది. ఏ బంధానికైనా ఇంటిమసీ ఎంత ముఖ్యమో చెప్పే కథ ఇది. దీప పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి పోతుంది. మాధురి ఒంటరిదై పోతుంది. కొద్దిరోజులకే పెళ్ళిలో అన్నీ బాగున్నట్టే ఉన్నా బోలెడంత మోసం ఉంది. ప్రేమ పేరుతో చాకిరి చేయించుకోవడం సాదించడం.... ఆలోచిస్తే స్త్రీలు ఎంత సుకుమారంగా నైస్‌గా దోపిడీకి గురవుతున్నారో అర్థమవుతుంది. ప్రేమ పెళ్ళి రెండింటిలో పురుషులు వాడుకుంటాడు. స్త్రీలు మానుకోపడతారని దీప ద్వారా ఒకప్పటి నుంచి సమాజంలో కొనసాగుతున్న ఆధిపత్య ధోరణిని ఎత్తిచూపి ఇలాంటి ఆలోచనలను మెదడు లోకి ఎక్కించింది. ఎవరని ప్రశ్ని స్తుంది రచయిత్రి. మనుషుల మధ్య ఉండాల్సిన ఇంటిమసీకి జండర్‌తో పని లేదుజ పెళ్లిలో జంట మధ్య ఇంటిమసీ లేక పోవడం ఒకరి మీద ఒకరికి గౌరవం లేకుండా సాగే సంసా రానికి విలువే లేదని కరాఖండిగా చెప్పడం చూడ వచ్చుస రంగు వెలిసిన జ్ఞాపకాలు కథలో మైథిలి తన 50వ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితుల బలవంతం మీద మందు తాగడం అది పడక వాంతి చేసుకుని వర్షపు రాత్రిలో ఒంటరిగా తన గదిలో కూర్చుని ఉండగా తాను ప్రేమించిన వారు తాను ప్రేమించిన వారి జ్ఞాపకాలు ఆమె మనసులో వర్షంలా కురుస్తూ ఉంటాయి. ఆమె జీవితంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇంటి బాల్కనీలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ బాల్కని ఆమె మనసు ప్రతీక.
మెల్లిగా వర్షంతో పాటు జ్ఞాపకాల వర్షం కూడా తగ్గిపోతుంది. అందరూ వెళ్ళిపోతారు మనసుని బాల్కనీ ఖాళీ చేసి మనుషులు వెళ్ళి పోయినా వారి తాలూకు జ్ఞాపకాలు మాత్రం మొండి వీర ప్రేమికుల్లా మిగిలి పోతాయి. అవి విరిగి పోయిన తన మనసు ముక్కలు అనడం ప్రతి ఒక్కరి అంతరంగాన్ని స్పృశిస్తుంది.
పురుషుల మధ్య పెళ్ళి తర్వాత కలిగిన ఆకర్షణ వాటిని దాన్ని వ్యక్తపరిచేందుకు జంకుతూ దాని తీవ్రత నుంచి బయటపడేందుకు తమ ఇగోను ఆసరా చేసుకునే వివాహితుల కథ ప్రేమ రిఫైండ్. వివాహిత అయిన ఒక స్త్రీకి మధ్యవయస్కుడు భార్యా పిల్లలున్న మరొక పురుషుడిపై కలిగిన ఆకర్షణ వల్ల ఎంత మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నదో ఈ కథలో చూడవచ్చు. ఈ ఆకర్షణ మాటలకందని గొప్ప ఫీలింగ్‌లా ఒప్పుకున్నప్పుడు కలిగిన ఆనందం గురించి అతడికి తెలియజేయాలని ఊరి చివరి గుడి దగ్గరికి రమ్మంటుంది. తాను పడుతున్న మానసిక హింస గురించి చెబుతుంది. దానికి అతడు చాలా తెలివిగా మొత్తం ఆడవాళ్ళ మానసిక స్థితిని ఎనలైజ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ తూ తన ఈగోను తృప్తి పరచుకుంటాడు. మొదట్లో అతనితో తన పరిచయం గుర్తుకొస్తుంది. ఎవరూ నీటిలోకి ఏదో విసిరారు... నిశ్చలంగా ఉన్న ఆమె మనసులో చిన్న రాయి విసిరినట్టు అతని పలకరింపు గుర్తుకు వచ్చింది. చివరికి అతనితో ఒకరి భావావేశాలను ప్రేరేపించే తృప్తి పరుచుకునే వీరు మొదట మీలోని వాయిడ్ గురించి తెలుసుకోండి అని తెలివిగా తెలియజేసే, అతని లోని డొల్లతనాన్ని అతని ముందుంచుతుంది.
అందం ఆత్మవిశ్వాసం గల శ్వేత అనే అమ్మాయి కథ వాలెంలైన్ ఎవ్వడే... కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆశాజ నకంగా లేకుండా ఎడ్యుకేషన్‌లోన్ తీసుకొని చదువుకున్న అమ్మాయి శ్వేత. చదువు తర్వాత ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదు కుంటుంది. ఆమెను ఇష్టపడిన బాలు, సందీప్‌లను సున్ని తంగా తిరస్కరిస్తుంది. ఆస్తి పరుడైన సందీప్ aజూ aతీఎy ను ప్రేమించాలంటే వెంటపడితే ''ఐ హావ్ రైట్ టుసే నో, యు షుడ్ నాట్ ఫోర్స్ మీనంగ్' అని ధైర్యం చెప్పి నా మీత గౌరవం లేని వాళ్లను ప్రేమించ లేను అంటుం ది. ఆమె ఆలోచనలను వ్యక్తిత్వాన్ని ఇష్టపడే కృష్ణ నువ్వు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించు కుంటుంది. అమ్మాయిలు తమకే కావాలో తెలిసిన వాళ్ళు స్వతంత్రులు జీవితాన్ని ఇలాంటి వారితో గడపాలనే దానిపై ఒక క్లారిటీ ఉన్న వారిగా చెప్పి కథ ఇది. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ....
ఇంటర్ మిషన్ కథలు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్న కావేరి పెళ్లవగానే భర్త పిల్లల కోసం ఉద్యోగం మానేస్తుంది. రొటీన్ జీవితంలో తన అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టు ఆమెకు భర్త పిల్లలు ఆమెను పంజరంలో చిలకలా మార్చివేశారు. ఈ విషయాన్ని వీకెండ్లో ఎక్కడికి పోలేదు. తనను కూతురు మొగుడు ఒక వేళ వెళ్ళినా తన కూతురు మొగుడు వంద సార్లు ఫోన్లు చేస్తారు అనడంలో కావేరి కుంగుబాటుదనం కనిపిస్తుంది. ఆత్మాభిమానాన్ని చం పుకుంటూ బతకడం నరకప్రాయం అవుతుంది ఆమెకు. ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేళాపాళా లేని తిండితో లావెక్కి పోతుంది. చివరిగా ఒక రోజు ధైర్యం చేసి భర్తతో పెళ్ళికి ముందు మనిద్దరమూ చదువు ఉద్యోగ్యాల్లో సమానమే, కానీ పెళ్ళయ్యాక నాకు ఒక్క దానికి మాత్రమే ఈ పనిష్మెంట్ ఏమిటి అని ప్రశ్నిస్తుంది. చూడడానికి చాలా చిన్న విషయంలా అనిపించినా ఇలాంటి పరిస్థితులను ఎదదుర్కొంటున్న కావేరీలె ఎందరో మన చుట్టూ కనిపిస్తారు. జీవితంలో నిర్లిప్తతను మోస్తూ....
లైంగిక సంబంధాలలో అసంతృప్తి హింస గురించి రాసిన కథ పునీత, పరిధి కథ పచ్చికలో పాముల్ని బుట్టలోకి పట్టాలి. అంటూ వర్తమాన సమాజంలో ప్రేమ పేరుతో వంచనచేసే మొగాళ్ళ పట్ల తెలివిగా మసలుకోవాలని అమ్మాయిలకు సందేశం ఇస్తుంది. ఇక గుడ్ మార్నింగ్ అదిత, వాహిని, స్పర్ధ, సూడో రియాలిటీస్, అనాటి వాన చినుకులు, సూరిగాడి కొలువు కథలు కూడా చక్కని ఇతివృత్తంతో వచ్చిన కథలుగా చెప్పవచ్చు.
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కథలు వస్తు వైవిధ్యంతో, విలక్షణ శైలితో కొత్త జీవితాన్ని ఆలోచనల్ని మనకు పరిచయం చేస్తాయి.... ఆలోచింపజేస్తాయి... జీవితాలని నిశితంగా పరిశీలించగల నేర్పు పరిపక్వత సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం మెండుగా కలిగిన అపర్ణ తోట తన తొలి కథ సంపుటిని బోల్డ్గాను, బ్యూటిఫుల్గాను మలచడంలో సఫలీ కృతులయ్యారు.
- బి. స్వప్ణ, సెల్: 9490235017