Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముదురు చీకట్లు పలుచబడుతున్న వేళ
ఆయుధం చివర రాజరికం వేలాడు తున్నప్పుడు
నా నేలను పరుచుకున్న
ఎర్రతివాచి పెడరెక్కలు విరిచిందెవ్వరు ?
రాజ మందిరాల్లో
విలాస జీవన శృంగార సుగంధాల్లో
ప్రజల ధనాన్ని జేబులేసుకున్న
అంత:పురం అవిటితనాన్ని
రాజ్ ప్రముఖ్‌గా మలుచుకున్నదెవ్వరు?
అలగా జనంగా పిలువబడుతున్నవారు
ఆయుధమై,
అధికారం కోసం పోరాటమై
ఊర్లని గుత్ప కర్రలుగా మారుస్తే
గుర్తు తెలియని శవాలుగా ప్రకటించిందెవ్వరు?
సైనిక కవాతుకు సంబురపడి
మంగళహారతులిచ్చి హత్తుకున్నందుకు
దోపిడీ దారులకే పెత్తన మిచ్చిన
రాజనీతి రంపపు కోతకు కొట్టుకుచచ్చిందెవ్వరు ?
పొలాలు సరిహద్దులు తెంపుకొని
రాజరికం నెత్తికొట్టి రైతు కూలీల చేతుల్లో
పసి బిడ్డలై నవ్వబోతున్న వేళ
సామ్యవాదం పేరుతో
సంధి కాలానికి గండి కొట్టిందెవ్వరు?
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, 9849082693