Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధాంత వ్యాస రచనా పోటీలు
సాహిత్య పరిశోధనలో ప్రామాణికతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పరిశోధనా పత్రాల రచనలో పోటీ నిర్వహించాలని నిర్ణయించింది.
ష తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి ప్రాతిపదికలుగా వ్యాసాలు ఉండాలి. ష 10 - 20 పుటల నిడివి గలిగిన పరిశోధనా వ్యాసాలు నవంబర్ 30వ తేదీలోగా కార్యదర్శి, సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ - 500004 చిరునామాకు పంపించాలి. ష పోటీలో గెలుపొందిన వ్యాసరచయితలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 10,000/-, 8,000/-, 5,000/-, పది వ్యాసాలకు ప్రోత్సాహక బహుమతుల కింద ఒక్కొక్కరికి 3,000/-లు బహుమతిగా ప్రపంచ తెలుగు మహాసభల వేదిక నుండి అందజేయబడుతుంది. ష పరిశోధనా పత్రం వెంట ఇది తమ సొంత వ్యాసమని, అముద్రితమని హామీ పత్రం జత చేయాలి. ష ఎంపిక చేసిన వ్యాసాలను తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురిస్తుంది. ష బహుమతుల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.
డా|| నందిని సిధారెడ్డి, చైర్మన్ - తెలంగాణ సాహిత్య అకాడమీ
మాదిగ సాంస్కృతిక కథలకు ఆహ్వానం
మాదిగ సాంస్కృతిక జీవితాన్ని, ఔన్నత్యాన్ని తెలిపే కథలను తీసుకొని రావాలని బహుజన సాంస్కృతిక వేదిక భావిస్తుంది. అలాంటి కథలు ఇప్పటికే ముద్రితమై ఉంటే ఆ కథలను కూడా స్వీకరిస్తారు. కథ నాలుగు నుండి ఆరు పేజీల మధ్య ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాలలోని మాదిగ జీవితాలను ప్రతిఫలించినట్లు కథలు ఉండాలి. అలాంటి కథలనే కమిటీ ఎంపిక చేస్తుంది. వాటిని పుస్తక రూపంలో తీసుకువస్తుంది. కథలను ఇ- మెయిల్ chiru007.com@rediffmail.com, sonnailabalraj@ gmail.com లకు డిసెంబర్ 30లోపు పంపించాలి.
స్ఫూర్తి అవార్డులకు ఆహ్వానం
'స్ఫూర్తి అవార్డులు-2017'కు నామినేషన్లను ఆహ్వానిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య ఆరోగ్యం, తెలుగు భాష, సామాజిక దృక్పథంతో కూడిన సాహిత్యం, ఆదర్శవంతమైన సమాజ సేవారంగాల్లో అవార్డులు ఉంటాయి. నామినేషన్లను బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, డో.నెం.4-4-120, బిటిసి హౌస్, 5వ లేన్, చంద్రమౌళి నగర్, గుంటూరు-522007, ఆం.ప్ర. చిరునామాకు నవంబర్ 30 లోపు పంపాలి.
- బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్
బాలసాహిత్య పురస్కారాల కోసం ఆహ్వానం
ముంబయి కేంద్రంగా నడుస్తున్న పద్మబినాని ఫౌండేషన్ 'వాత్సల్య పురస్కారం' పేరుతో తెలుగు బాలసాహిత్యంలో కృషి చేసిన వారికి ఇవ్వనుంది. రచయితలు తమ పేరు, చిరునామాతో అచ్చయిన బాలసాహిత్యం పుస్తకాలు రెండు, పాస్పోర్ట్ ఫొటోలు పంపించాలి. ఇంగ్లీషు లేక హిందీలో పొందుపరిచిన బయోడేటాని 2018, జనవరి 1వ తేదీ లోపు పద్మబినాని ఫౌండేషన్, టెంపుల్ టెర్రేస్, 55, ఫోర్ జట్ స్ట్రీట్, గొవాలియా టాంక్, గ్రాంట్ రోడ్, ముంబాయి - 40036.
ఇమెయిల్ : padmabinani@gmail.com.
- ఆచార్య ఆర్.ఎస్.సర్రాజు, జయధీర్ తిరుమలరావు