Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యునైటెడ్ స్టేట్స్, హాల్ ఆఫ్ ఫేం అవార్డుకు ఈ సారి భారత దేశానికి చెందిన తెలంగాణ కవి, సామాజిక కార్యకర్త, డా||కాంచనపల్లి ఎంపికయ్యారు. ఈ సంస్థ తన ప్రతి వార్షికోత్సవానికి ఇరవై ఒక మంది ప్రపంచ దేశాలకు చెందిన సామాజిక కార్యకర్తలను, సృజనకారులను, విద్యావేత్తలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది. హాల్ ఆఫ్ ఫేం జరుపుకునే ఈ ముప్పై మూడవ వార్షికోత్స కార్యక్రమంలో ఎంపిక చేసిన ఇరవై ఒక్కరిలో కాంచనపల్లి ఒకరు. కాలిఫోర్నియాలోని సాక్రిమెంట్లో జరిగే సభలో జులై 7వ తేదీన ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.