Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈగలకు
బెల్లం ముక్కలిసిరేసినట్లు
నది చేపలకు
ఎర్రలను ఎరేసినట్లు..
కుర్చీ కోసం
పథకాల పానకం పూసి
ముందస్తు
ఎన్నికల తీపి పంచబోతుంది.
ఆసనం కొట్లాటల
అస్మదీయులో, తస్మదీయులో
స్వపక్షమో, విపక్షమో
గెలుత్తమనుకునుడే సాహసం.
నాయకత్వం..
సంకలెత్తుకునే పిల్లనుకుంటే
విజయ పీఠం
నిన్ను పాతాళానికి తొక్కిపోతది.
వరాల మిఠాయి ఎక్కువైందా
పదవికీ పెను ప్రమాదమే !
ఎరవేసిన గాలానికే చిక్కామో
కుర్చీలాట పద్మవ్యూహమే !!
అంతా చేతికి
చిక్కినట్టే అనిపిస్తది.
ఫలితం మాత్రం
బోర్లబొక్కల పడేసిపోతది.
దీపమున్నప్పుడు
ఇల్లు సక్కవెట్టుకునుడు ఇగురమే.
ఓటరు సూపు ఎటువైపున్నదో
తెల్సుకునుడు కత్తిమీద సామే !
పదవిపై ఆశ..
ఎవరికైన మన్సుల గట్టిగుంటది.
కని ప్రజలనాడి
దొర్కవట్టుకునుడే బహు కష్టం.
- అశోక్ అవారి, 9000576581