Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా నిద్రా సమయాన నీ విష ప్రయోగం
నాకు కొన్ని నిద్ర లేని రాత్రులను కానుకివ్వొచ్చు.
నేను మెలకువలో ఆలోచించడం మొదలెట్టాక
నీ జీవితకాల నిద్ర నా చేతిలోని రిమోట్
అవుతుందని ఊహించి ఉండవు కదా!
ఆస్తులు అంతస్తుల దోపిడిలో
ప్రేమలను పెట్టుబడిగా మార్చడం
నీకు శనక్కాయలు బుక్కినంత తేలికే!!
నీ కష్టం కాని
చెమట చుక్కల పరిమళం గానీ లేని ధనం
నిన్నెట్లా వరిస్తుందని కలగన్నవ్?
ఆశ మంచిదే,
కోరిక ఉండవలసిందే,
బంగారు బాతును వేపుకు తింటే
ఏమవుతుందో తెలుసు కదా??
చివరకు నిన్న
నలుపు నోట్ల నోట్లో మట్టి పడ్డట్టు
మొన్నటి లంచం చేతులకు ఇంకు అంటినట్టు
నువ్వు మిగలడం నిజం.
సిరి సంపదలు కాదు
కాసిని ఆప్యాయతా కుప్పలను
పోగేసుకుంట వెల్తేనే
ఈ పద్యం నిలిచినట్టు.
నీకు జీవిత పరమార్ధం తెలిసినట్టు.
- విలాసాగరం రవీందర్, 9440932934