Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు
మేం ఓట్లు వేయడానికి వొస్తాం'
ఇట్లాంటి స్టిక్కర్లు మాఊళ్లో
ఇంటి డోర్లపై అతికించ బడ్డాయి!
మా ఊళ్లో ప్రతి వీధిలో, కూడలిలో
ఓ ఫ్లెక్సీ మీద యిట్లా వుంది:
'ఈ ఊళ్ళో ఓట్లు కొనడానికి వచ్చేవాడు
గాడిద కొడుకు
వాడు నా కొడుకు కానే కాడని
గాడిద బిగ్గరగా అరుస్తున్నది'
ఒక ఎమ్మెల్యే 28 లక్షలు ఖర్చు చెయ్యొచ్చట
ఇది ఎలక్షన్ కమిషన్ హాస్యాస్పద ప్రకటన
దీన్ని పాటించే నీతిమంతుడున్నాడా?
రేపు మనకళ్ళ ముందు జరిగే ధన ప్రవాహాన్ని
ఆపే ఘనుడెవ్వడు?
మళ్ళీ శేషన్ లాంటివాడు వస్తే
ఎంత బావుండు!
దేశంలో, రాష్ట్రాలలో ఎక్కడ చూచినా
కొన్ని కుటుంబాల పాలనే కొనసాగుతున్నది
ధనికపేద వర్గాలు పోయి
కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి
ప్రాబల్య వర్గాలదే పై చేయి
కర్ర కలవానిదే బర్రె
ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది?
రాబోయే ఎన్నికల్లో
కాబోయే ఎమ్మెల్యేలు
చిత్ర విచిత్రాలు చేస్తున్నారు:
పిల్లలకు స్నానాలు చేయిస్తున్నరు
రోడ్ల మీద దోసెలు వేస్తున్నరు
ఛారు వాలాలు అవుతున్నరు
చెప్పులు కుడ్తున్నరు
పిల్లల ముడ్లు కడిగే దొక్కటే మిగిలింది
అదీ చేస్తారేమో?!
ఈ వింతలన్నీ మీడియాల్లో
ప్రచురితమవుతున్నాయి
ప్రసారమవుతున్నాయి
భారత్లో ప్రజాస్వామ్యం
ఇట్లా పరిఢ విల్లుతోంది
మూడు పువ్వులు
ఆరుకాయలు కాస్తున్నది
ఈ ఓట్ల జాతర
దశాబ్దాలుగా జరుగుతున్నది
ఓట్లు కావాలంటే
నోట్లకు రెక్కలొస్తాయి
పేదోనికి అధికారం
అందని ద్రాక్షే!
జై తెలంగాణ! జై భారత్!
- జలజం సత్యనారాయణ, 849444944