Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లేర్ల ముళ్ళపై
పూసిన పసుపు పచ్చని పువ్వు
రాజకీయం!
పైకి పుష్పమే
కంటికి కనవడుతుంటది.
రెక్కలు తొలగితే
గాయాలు గేయాలవుతరు!
పార్టీల జెండాల
రంగులన్నీ శుభసూచకాలే.
ఎన్నికల యుద్ధంలో
గెలిచేది మాత్రం ఒక్కరే!
అలరు బలరు లు..
ఆప్తవచనాలు..
అన్నీ కుర్చీల దాగుడు మూతలే!
నువ్వు ఎన్ని రంగులు మార్చినా
ఓటరు మన్సుల స్థానం లేకపోతే
మట్టి కరుసుడు ఖాయమే!
ఓటర్లిప్పుడు
పదవీధేనువుల్లా కంటికి కనవడే
ఆది దేవుళ్ళు!
గెల్సినంక ఎప్పటికీ
నిరీక్షించే కటాక్షం లేని భక్తులు!!
ప్రజలనాడి పట్టుకుంటెనే
విజయతిలకం దిద్దుకుంటరు.
ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తెనే
పరిమళమై వ్యాపిస్తరు !!
- అశోక్ అవారి,
9000576581