Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుభవాలను అక్షరాక్షరాల్లోకి ఒంపుతూనే
చరిత్ర పాఠాలతో వర్తమానమై పలకరిస్తుంది
పుస్తకం జ్ఞాపకాలను పదిలపరిచే జ్ఞానపందిరి
సామాజిక శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందిస్తూనే
ప్రాపంచిక అనుభవాల కరదీపికవుతుంది
పుస్తకం తరతరాలుగా తరిగిపోని జ్ఞానగంధం
ఆలోచనలకు నిత్యం అంకురార్పణ చేస్తూనే
భావకుసుమాలను వికసింపచేస్తూనే ఉంటుంది
పుస్తకం అక్షర తోరణాలతో వెలిగే ఆణిముత్యం
జాతికి జాగృతపరచే జ్ఞానాన్ని అందిస్తూనే
భవిష్యత్తుకు మార్గం చూపే చుక్కానవుతుంది
పుస్తకం భవిష్యత్ తరాలకు తరగని పెన్నిధి
నిరంతరం తిమిరంతో సమరం చేస్తూనే
వెలుగుదివ్వెలను పంచే దీపశిఖవుతుంది
పుస్తకం అక్షరపరిమళమిచ్చే జ్ఞానసమీరం
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,
9032844017