Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్వజన్మలో అమ్మై ఉంటుంది
ప్రతిరోజూ నా అవసరాలు తీర్చి
నన్ను శుభ్రం చేసి దుస్తులు వేసి
ఆప్యాయతతో పలకరిస్తున్న
ఆమెకు నేను ఏమివ్వగలను ?
పక్షం రోజుల తర్వాత..నా పాదాలు
ఇపుడిపుడే చేతనత్వం సంతరించుకున్నాయి..
బతకటానికి ఎదురు నిలబడాలంటే
ఒక్క అడుగైనా ముందుకు వేయాల్సిందే..
జీవనవనంలో పరిచిన పూలబాట పై
నా నడక సాగిపోవాలి
మునివేళ్లపై నిలబడి సన్నజాజులు కోసుకునే
ఉదయాలకోసం ఎదురు చూస్తున్న
ఇపుడిపుడే ఎదుగుతున్న దాన్ని
నవ్య కవిత్వమై వికసిస్తున్న దాన్ని
ఇంటికి రాగానే
అక్షరాల పరిమళం గుప్పుమంటూ
నా గుండె తలుపు తట్టింది
కొన్ని దినాలుగా ఆసుపత్రి మందులకు, శరీరకోతలకు
తల్లడిల్లిన హదయం.. కవన మలయసమీరం
నా తనువు ను స్పర్శించగానే
కవన పూదోటను చేరాలనే
తొందరలో నా పదములకు
కొత్త గా నడకలు నేర్పిస్తున్న..
- ములుగు.లక్ష్మిమైథిలి,
9440088482