Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడవైన ముక్కు
కెంపులు పులుముకున్న ఎత్తైన కాళ్ళు
సింగిడి సుంచి రెక్కలుగ సుట్టకున్న
కొలనుసోయగం సైబీరియా కొంగ
కొన్ని కార్తులు రాబందులై ఎక్కిరిత్తె
ధైర్నంజెడక పొట్టచేతవట్టుకొని
వేలమైళ్ళను రెక్కలసందున పొదువుకొని
హుందాగా ఎగిరొత్తది
ఎనకటిసంది కట్టడి ఉన్నట్టు
దర్జాగా కాలుమోపి
బురదంటని తామరపువ్వోలె
మా ఊరచెరువుకు
కొత్త సొగబులద్దుతది
సుట్టుజేరిన పచ్చులకు
వలసల వలపోతల్ని
ఒగ్గుకథోలె చెప్పి బుద్దిదీర్సుకుంటది
సర్దుబాటు చేసుకుంట
సాగిపోవడమే జీవితమర్మమని
బతుకు సుద్దులు వల్లిస్తది
సంచారజాతులోలె తిరిగీ తిరిగి
దేశం పోయే ముందు, బువ్వపెట్టిన చెరువు
పదికాలాలు సల్లగుండాలని
దీవెనార్తివెడ్తది
(సైబీరియా కొంగ మా ప్రాంత చెరువుకు వచ్చిన సందర్భంగా)
- వడ్లకొండ దయాకర్,
94404 27968