Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు వృద్ధోపనిషత్ ఆవిష్కరణ సభ
ఆచార్య ఎన్.గోపి రచించిన 'వృద్ధోపనిషత్' కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతిలో జరుగుతుంది.
పోరాటాల పొత్తిలి పుస్తకావిష్కరణ సభ
కూర మల్లమ్మ యాదిలో ఒక ధీశాలి యాది సభ ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో జరుగుతుంది. ఈ సభలో 'పోరాటాల పొత్తిలి' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
19న 'పుట్ల హేమలత జ్ఞాపకాలను పంచుకుందాం' సభ
ప్రముఖ రచయిత్రి 'పుట్ల హేమలత జ్ఞాపకాలను పంచుకుందాం రండి' అని ప్రజాస్వామిక రచయిత్రలు వేదిక ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 19న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరుగుతుంది.
23న కృష్ణారావు అభినందన సభ
కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎ.కృష్ణారావు అభినందన సభ ఈ నెల 23వ తేదీన రవీంద్రభారతిలో జరుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.
24న తెలంగాణ కవిత్వ కార్యశాల
ఈ నెల 24వ తేదీన నల్లగొండలో తెలంగాణ కవిత్వ కార్యశాల జరుగుతుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ, సృజనసమితి ఆధ్వర్యంలో నాలుగు సెషన్లలో ఈ సభ జరుగుతుంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
24న 'కవిత్వ లయ' సభ
తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో 'ధ్వని శీర్షికన కవిత్వపఠనం, విశ్లేషణా కార్యక్రమం జరుగుతాయి. ఈ సభలో మునాస వెంకట్, అంబటి వెంకన్న, హనీఫ్ కవిత్వం వినిపిస్తారు. అంబటి సురేంద్రరాజు కవిత్వ విశ్లేషణ చేస్తారని సమాఖ్య కన్వీనర్ ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.