Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడువు
పక్షుల్లారా
స్వప్నాల్లారా
ఇంత పొద్దున్నే
మా ఇంటికి రాకండి !
పరుచుకున్న బిస్తర్ తీయనేలేదు
ఎంత దొర్లినా, ఎటుతిరిగి పడుకున్నా,
రాత్రంతా నిద్ర పట్టనేలేదు
బయటనిలబడి
తలుపు కొట్టేవాళ్లు
రాజభటులా !
యమకింకరులా !!
వచ్చింది ఎవరైనాసరే,
నాకుకొంత గడువివ్వండి!
పిల్లలెవరూ, ఇంకా చేతికిరాలేదు
చాలా చిన్నవాళ్లు
నా కవిత్వమూ
ఖామోషి తనమూ
అర్థం చేసుకోలేని పసివాళ్లు
వాళ్లు బతకడానికి
కొంత ప్రేమించడంనేర్పి
లేత అరచేతులను
ముద్దాడి వస్తాను
ఈ ఒక్క మోకా నాకివ్వండి చాలు !
- ఆశారాజు,
93923 02245
వండర్
గుడ్ గుడ్ అంటూ
నక్క సంబరంగా అరిచింది
బెటర్ బెటర్ అంటూ
తోడేలు చప్పట్లు కొట్టింది
బెస్ట్ బెస్ట్ అంటూ
దుమ్మలగొండు గుండ్రంగా
తిరిగింది
ద యూనివర్సల్ వండర్ అంటూ
అడవికుక్క గంతులు వేసింది
ఏంటబ్బా అనుకోని
వెళ్లి చూసాను
రాబందు ఒకటి
సింహం మీద ఊరేగుతోంది
- పర్కపెల్లి యాదగిరి,
92999 09516