Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాకిలి ఎదిగీ ఎదిగీ
గోరింటకు దూరమైంది
ఇల్లు
పెరిగీ పెరిగీ
పునాదికి దూరమైంది
కుటుంబం
కలిగీ కలిగీ
కల్మిడికి దూరమైంది
రహదారి
వెడల్పై వెడల్పై
పాదచారికి దూరమైంది
వూరుజి మారీ మారీ
పాలపిట్టకు దూరమైంది
అడవి ఆధునికమై ఆధునికమై
ఆదివాసీకి దూరమైంది
నగరం నిగారించీ నిగారించీ
సగటుజీవికి దూరమైంది
ప్రాంతం మెరిసీ మెరిసీ
ప్రాంతీయుడికి దూరమైంది
దేశం వెలిగీ వెలిగీ
పొలాలకు దూరమైంది
-దర్భశయనం శ్రీనివాసాచార్య