Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెత్తుటి ప్రవాహం
పగుళ్లలో ఇంకిన
కనుపాపల కలలు
కనుగుడ్డును
పెకిలించిన దృశ్యం,
పగిలిన అక్వేరియం
దిగబడిన గాజుముక్కలు
ప్రాణం ఒదిలిన చేపపిల్లలు...
నీ మంచు పహారా గాథల్ని
గానం చేద్దామనుకున్నావో..
నీ చుట్టూ కమ్ముకున్న
చీకటి పొరల్లో
నా స్వప్నాలనే కనివుంటావో..
నీ కంటి రెటీనాను తగిలి
ఊపిరాడనీయని విస్ఫోటనపు
వెలుగులో
నా భవిష్యత్త్ దారుల్ని
వెతికే వుంటావో...
నీ పాదాల ఎక్కిపించుకొని
నేర్పే నడకలలో
ఎన్ని శిఖరాలను చూసుంటావో..
నువ్వు రావని, లేవని
వెలిగించిన మూంబత్తి కాంతిలో..
అమ్మ రెప్పల తడి సాక్షిగా
నువ్వున్నావు
అక్కడ అడుగులు వేసే
''ధూమ్ హాల్'' నృత్యంలో గుండెలయలా
''రోడోడెండ్రాన్'' పువ్వుల రంగులలోనో
''జీలం''నది ప్రవాహంలో
చిక్కుకున్న నీ మనసుగానో ..
''చినార్''చెట్టుమీద వాలి
బుగులు పడని
పిట్టల రెక్కల స్వేచ్ఛా ఊపిరిలోనో
నువ్వున్నావ్
అమ్మ గుండె చప్పుడు సాక్షిగా...
- సిహెచ్.ఉషారాణి,
9441328142