Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాలిలా మారాను ..
శూన్యమై పోయాను నిను చేరుకున్నాను.
నీ ఊపిరై నీలో కలిసిపోయాను..
పూమొగ్గలా మారాను పుష్పమైపోయాను
సువాసనా పరిమళాలతో నిను చేరుకున్నాను
నీ తనువెల్లా తడిమాను ...
చినుకుగా మారాను.. వర్షమై పోయాను..
చిరుజల్లులు కురిపిస్తూ..
మనసంతా మురిపిస్తూ..
నిలువెల్లా తడిపాను ..
అణువణువు తాకాను ...
సెలయేరులా మారాను గలగలా పారాను.
వాగు వంకలు ,కొండ కోనలు దాటాను
పరుగు పరుగున పరవళ్ళు తొక్కుతూ
నిను చేరుకున్నాను. నీ పాదాలు తడిపాను
చంద్రుడై పోయాను..
పున్నమి వెన్నెలగా మారాను..
పారిజాత సుగంధాలు మోసుకొచ్చాను
చల్లని చెలిమితో నిను అల్లుకున్నాను ...
వెదురుగా మారాను నను మలచుకున్నాను
నువు అందించే రాగాల కోసం
తియ్యని గాయాలు చేసుకుని
వేణువై పోయాను
గానమై నీ హృదయాన్ని చేరాను..
నీ తలపులు తాకి నన్ను నేను కొల్పోయిన
ప్రతిసారీ నిన్ను చేరుకున్న మధుర క్షణాలవి ..
ఘనీభవించి జీవక్షణాలుగా ఉండిపోని ..
నేను నీతో పంచుకున్న ఆ మాధుర్యాలన్నీ
మన గుండెల్లో అలాగే నిలిచిపోనీ..
- గుడిపల్లి విద్యావతి,
8886614346