Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భలే భలే బండి నా ఎడ్ల బండి రెండెడ్ల బండి
పెట్రోల్ డీజిల్ గొడవలేని బండి!
'హారు... హారు' అంటే పరుగెత్తుతోంది
'ఓరు... ఓరు' అంటే ఆగిపోతోంది నా బండి!
'పొల్యూషన్' గొడవ లేదు ఆస్త్మాకు తావులేదు.
పర్యావరణానికి మంచి పలుకుబడి
నా బండి రెండెడ్ల బండి!
శబ్ద - పొగ కాలుష్య రహితం
బండి 'లాక్' చేశానా లేదన్న ప్రసక్తే లేదు!
ఇన్య్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని బండి
రైతుల 'టోల్ ఫ్రీ బండి'
'ఆక్సిలేటర్, బ్రేక్' ల గొడవ లేనేలేదు!
బ్యాటరీ చార్జింగ్, రీ చార్జింగ్ ల్లేని
చల్ చల్ బండి నా బండి రెండెడ్ల బండి!
- అమ్జద్