Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలూ, మీరు బతకటం లేదు, తరచి చూడగలిగితే-
బతుకు ఒక సుందరమైన కలల హిమ హర్మ్యం
లేదా అశ్రద్ధ వహించిన సంతోష భరితాల ఉత్సవం అది
మీ హృదయాల్లో గంతులేస్తూ
అచ్చం సముద్రపు అలల్లా,
సువర్ణమయ మరియు స్వచ్ఛపుష్యరాగ కాంతుల్లో
పిల్లలూ, మీరు బతకటం లేదు, కానీ బతుకుతున్నరు
కొంత అవిశ్రాంత సమయం వరకు లేస్తూ, కదులుతూ
మీ హృదయాలు మేల్కొంటూ ఇంకనూ ఆకలి గొంటూ
ప్రేమ మరియు దప్పిక తర్వాత
ఉద్విగమైన వాంఛతో విషయాల కొరకు
అవి కాల్చేస్తయి మీ కనుబొమలను
అవస్థల ఎరుపు రక్తకణాలతో
మీరు పోరాడుతుండాలె భరింపరాని విచారాల మరియు భయాలతో
కాలాలు కాలాలుగ కల బద్దలౌతోంటే పుట్టే సంఘర్షణలతో
గాయపడిన తీవ్ర కోరికలతో ఇంకా పెల్లుబికిన కలహాలతో
పిల్లలూ, మీరు బతకటం లేదు, ఈ బతుకు కొరకు-
ఆంగ్లమూలం: 'లైఫ్' - సరోజినీ నాయుడు
స్వేచ్ఛానువాదం : దాసరాజు రామారావు