Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తలె సుట్టూ పడిపోయిన మెతుకులను
సూశినప్పుడు, వాటిని మల్లా ఏరుకొని
అన్నంలో కలుపుకొని తినబుద్ధైతది
మట్టిమట్టైన మెతుకులను
ఉఫ్ ఉఫ్ అని ఊది, నోట్లేసుకున్నప్పుడు
నోరంతా మట్టి పరిమళమైతది
ఆకలి మంటై, కడుపును కాలుస్తున్నప్పుడు
పాశిందైనా సరే
పట్టెడన్నం పరమాన్నమైతది
దోస్తులు ముచ్చట్లు వెట్టుకుంట
ఒకల్ల సద్ది ఇంకొకల్లు గుంజుకొని దింటుంటే
ఎంగిలి కూడు కూడా అమృతమైతది
ఎన్నొద్దులకో ఇంత బువ్వ సూశే
ఖాలీ బొచ్చెలో
నీ కంచంలోని కూడు గుమ్మరిస్తున్నప్పుడు
అన్నం, వేల్పులకెత్తిన బోనమైతది.
- డా|| బి. బాలకృష్ణ, 9948997983