Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణారుణ భారతాన ఉదయించిన క్రాంతివై
ఉవ్వెత్తున ఎగసిపడే ఉగ్రరూప ఉప్పెనవై
భుజంగాల పనిపట్టే చలిచీమల రోషమై
ధనస్వాముల కింద నలుగు శ్రమజీవుల కోసమై
బడుగుజీవి వెన్నెముక వజ్రాయుధమై నిలువగ
తడిఆరిన గొంతులన్ని దేవదత్తమందించగ
విప్లవాల వీరుడవై విజయశంఖమూదగ
రగిలించిన అగ్నివై, లంఘంచిన బెబ్బులివై
ఉడుకు నెత్తుటి నరాలు వింటినారి సంధించగ
కాలేకడుపుల పేగులు అగ్నివీణ సవరించగ
భూస్వాముల గుండెల్లో బీభత్సం సృష్టించగ
కౌంతేయుని అస్త్రమై, ఆ సూర్యుని కిరణమై
నిప్పుల విహంగం మీద, రక్తపు సెలయేళ్ళు దాటి
వీరసింహమై గర్జిస్తూ, విషనాగుల కోరలు తీస్తూ
బాధిత దు:ఖిత తాడిత పీడిత కర్షక కార్మిక
హీనుల దీనుల సౌభాగ్యం కాంక్షిస్తూ
మరో ప్రపంచపు, మహా ప్రపంచపు
మరో ధరిత్రిని స్థాపిస్తూ
రావయ్యా శ్రీశ్రీ రా రావయ్యా శ్రీశ్రీ
- డా||బి.బాలకృష్ణ,
9948997983