Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'క్రీడాకథ' ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంచిక వెబ్ పత్రిక - సాహితి ప్రచురణలు ఆధ్వర్యంలో కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ సంపాదకత్వం వహించిన 'క్రీడాకథ (కథాసంకలనం)' ఆవిష్కరణ సభ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో జరుగుతుంది. ఈ సభకు వాసిరెడ్డి నవీన్, నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, కె.పి.అశోక్‌కుమార్ హాజరవుతారు.
కవి సమ్మేళనం
మాతృదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహితి ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కవి సమ్మేళనం నిర్వహిస్తుంది. ఈ సభలో అమృత లత, విమలక్క, సలీమ, రమాదేవి కులకర్ణి, సైదులు, సయ్యద్ ముజాహిద్ అలీ పాల్గొంటారు.
అమృతలత - అపురూప పురస్కారాలు
ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు తెలుగు యూనివర్సిటీలో అమృతలత - అపురూప పురస్కారాల ప్రదానోత్సవ సభ జరుగుతుంది. వివిధ రంగాలలో రాణిస్తున్న జలంధర, ఎస్.పి.శైలజ, శీలా సుభద్రాదేవి, గోళ్ళమూడి సంధ్య, స్వాతి శ్రీపాద, ఆచార్య శరత్ జ్యోత్న్సారాణి, డా||శిలాలోలిత, కిరణ్‌బాల, కన్నెగంటి అనసూయ, వనజా ఉదరు, అయినంపూడి శ్రీలక్ష్మి, తాయమ్మ కరుణలకు పురస్కారాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డా||కె.వి.రమణాచారి, షావుకారు జానకి పాల్గొంటారు.
శిఖామణికి చందు సుబ్బారావు సాహితీ పురస్కారం
చందు సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా ఇచ్చే సాహితీ పురస్కారానికి ఈ సంవత్సరం శిఖామణి ఎంపికయ్యారు. ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగే సాహితీ సభలో పురస్కారం జ్ఞాపిక ప్రదానం, సత్కారం వుంటుంది.
విశాలాక్షి సాహిత్య పురస్కారాలు- 2019
విశాలాక్షి సాహిత్య పత్రిక నిర్వహించిన 'విశాలాక్షి సాహిత్య పురస్కారాలు - 2019' పోటీలో కథలు, కవితల విజేతలకు ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్థానిక టౌన్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. వీరితో పాటు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న ఐదుగురికి విశాలాక్షి సాహితీ పురస్కారాలు అందజేస్తారు.
సహృదయ సాహితీ పురస్కారం -2018
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆగస్టు 2019 మొదటివారంలో నిర్వహించే 23 వ వార్షికోత్సవంలో ప్రముఖ కవులు ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా అందించే 'సహృదయ సాహితీ పురస్కారం 2018' కొరకు వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది. తెలుగు వచన కవులు 2014-2018 మధ్యకాలంలో ప్రచురితమైన వచన కవితా సంపుటాలను జూన్ 15 లోగా కుందావఝల కృష్ణమూర్తి, సాహిత్య కార్యదర్శి శ్రీమాత ప్లాట్ నం. 207ఇంటి.నం. 02-07-580 సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీ హనుమ కొండ 506001. సెల్ నెం: 9849366652 చిరునామాకు పంపాలి. - డా||ఎన్.వి.ఎన్. చారి, ప్రధాన కార్యదర్శి, 9866610429