Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీకేం నిమ్మళంగనే వున్నరు
మాకే కద రంది
కన్నందుకు పిల్లల ఎక్కిళ్లూ ఏడ్పులూ
బాదలూ బయాలూ మాయి కూడా గన్క
మాకే కద రంది
నిన్న కళ్ళ ముంగట వుషారుగ తిరిగిన పిల్లలు
ఇవాళ లేరు
నిన్న పచ్చగ పువ్వుల్లా ముర్సిన వాళ్ళు
ఇవాళ శవాలు
ఏం జెప్పుకోవాలి
99 కి గాను సున్నా వొస్తే
పిల్లలు తల్లడిల్లకుంటర కలలు కాలిపోయినందుకు!
మీకేం, కొన్ని తప్పులు దొర్లినయని నిమ్మళంగ చెప్తరు
తప్పులు జరగందెపుడని మాటనేర్పు ప్రదర్శిస్తరు కూడా
ఒక్క కన్నీటి బొట్టూ రాలదు సెగ పుట్టదు
గుర్తుకుందా మీకు
ఉమ్మడి రాజ్యంల తప్పులకు యేళ్ళకొద్ది మండిపడ్డరు
అగ్గిగుగ్గిలమైన్రు వూరారా తిరిగిన్రు
మేమూ మా పిల్లలు సుత సై అన్నం కద మండినం కద
ఇవాళ గింత జరిగితె మటుకు చల్లంగనె మాటలు చెపుతున్నరు
ఇవాల్టికి దిక్కులేదు గానీ ఎల్లుండికి అంతా సక్కబడ్తదంటరు
ఇంక మీ దగ్గరి పెద్ద పెద్ద సార్లేమొ పెద్ద సాములోర్లెక్క
బహుసక్కగ
ఆ పనో ఈ పనో నేర్చుకొమ్మని ఉచిత చిట్కాలనిస్తున్నరు
గుర్తుకుందా మీకు
నిన్నమొన్ననె మా గడపల దాక వొచ్చి
చేతులు పట్టుకున్నరు మాట మీద మాట చెప్పిన్రు
నమ్మినం కద, మా వేళ్ళ మీద సిరా ఇంక ఆరను గుడ ఆర్లె
ఇవాళ పెద్ద పెద్ద తప్పులకు గింత గోరం జరిగితె
బస్తీల కూర్చొని మాట్లాడ్తరు నిబ్బరంగ!
పిల్లల శవాలు లేచిన వాకిళ్ళు ఎట్లుంటయొ
మీకెట్ల తెలుస్తది
పిల్లల శవాల్ని మోసిన చేతులివి
వీటితోని గిప్పుడు యేం జెయమంటరో మీరే చెప్పండి
కడుపు కోత తోని మాట్లాడ్తున్నం, గంతే!
- దర్భశయనం శ్రీనివాసాచార్య,
94404 19039