Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరానికి..
రెక్కలు కట్టనిదే
పదం తూనీగై ఎగరదు.
పదం..
భావవర్ణం పులుముకోనిదే
రంగు సీతాకోకై తిరగదు.
వాక్యం..
శిల్ప సొగసులద్దుకోనిదే
కావ్యం కమనీయమే కాదు.
కవి ప్రజాపక్షపాతి కాలేదంటే
ఏ చరిత్రలో..
అక్షరం పేజీలుగా మొలవదు.
కవిత్వం చెట్టై నిలవందే
ఏ పాఠకుడూ పిట్టలా..
తనంతట తానై వచ్చి వాలడు.
- అశోక్ అవారి,
9000576581