Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిడిసిపాటు తగదు
ఎల్లకాలం
మనదే చెల్లుబాటు కుదరదు
ఇంద్రధనస్సులో
రంగులు వెలిసిపోవడం
ఎంత సమయం
మొక్కకు పాదుకట్టి
పాకే తీగకు పందిరేసి
నిలబెట్టడమే తెలిసినవాళ్ళు
ఇన్నాళ్ళూ పొలాలకే పరిమితమై
ఇంతకాలానికి
పొలిమేరదాటి నిలుచున్నారు
ఆర్జీలు పెట్టారు
అభ్యర్థించారు
వోపికపట్టడానికి
వొక్కరోజు బాగోతమా
యేండ్లకేండ్లు విన్నవించి
విసిగివేసారినవాళ్ళు
వినికిడి సమస్య
ఎవడికీలేదు
వినాలనుకోలేకపోవడమే
జాడ్యమని తేలిపోయాక
తేల్చుకోడానికే అడుగేశారు
మొన్న టీఎన్
నిన్న నాసిక్
నేడు ఇందూరూ వారణాసి
పాయలన్నీ కలిసి
ప్రవాహమయ్యే సంకేతం
మట్టిస్వభావాన్ని
మరొక్కసారి
విడమర్చిచెప్పిన
నిలువెత్తు నిఘంటువు
నిజంబాద
పసుపే కదా
అని తీసిపారేయకండి
రేపు వరి కూడా
బరిలోకి దిగుతుంది...
- కొండి మల్లారెడ్డి