Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హమ్ల మన బస్తిమీన జర్గింది
మన ఇంటి మీన జర్గింది!
నీ అన్నతమ్ముల్లు, అక్కసెల్లెండ్రు, నీ దోస్తులు..
పార్కుకువోతె సంపిర్రు
వొటలుకుబోతె సంపిర్రు
రైలు టేసంకుబోతె సంపిర్రు
యాడ ఎప్పుడు ఎవుర్ని సంపుతరో అని మీయమ్మ
కంటిమీన కున్కులేక
నోట్ల ముద్దవోక అల్లాడతంటే...
నీకేమయింది బిడ్డా?
ఆగమాగమైన ఇల్లుజూస్తవు
డూటికిబోయి, తూటాల పాలవడ్డ దోస్తుల శవాలు జూస్తవు
ఏం జర్గింది, ఎట్ల జర్గిందని
హమ్లజేసినోల్లనడ్గుతవేంది బిడ్డా?
మీ యమ్మని 'వెయ్యికోతలుకోసి,
సచ్చెదాక రగతంగారిపిస్త'నని మిద్దెక్కి అరిసినోన్ని
గుండెకత్తుకున్నవ్ సరే
సోయిలేక రగతం కారుస్త గైండ్ల కూలవడ్డ
మీయమ్మ తబియతేందని అర్సనైన అర్సవు ?
నీ ఇంట్ల ఏం జర్గిందో ఈ పరాయోల్లనడుక్కొనుడేంది?
గుండె బాదుకొంట నీ సెల్లె, నీ తమ్మి, నీ దోస్తు సెప్తలేరా?
ఆ సూపేంది బిడ్డా?
మీ అమ్మ వెట్టిన సంగటి తిని, సెట్టంత ఎదిగి,
నువు పుట్టి పారాడిన ఇంట్ల
నువ్వడుగేస్తే కింద అరిసేతులువెట్టిన గడ్డమీన నిల్వబడి
అట్ల సూస్తవేంది బిడ్డా?
పరాయోడొచ్చి ఇంట్ల గుపాయించి కుల్లబొడిచిన నెప్పికన్న
నీ సూపునిండ మా నియ్యత్ పైన్నే కానవడ్తున్న అనుమానం,
సూలమల్లె గుండెల గుచ్చుతాంది!
ఏందిది బిడ్డా?
సదువుకుబోయి గొప్పోనివై, తవ్వి తలకెత్తుతవని
కండ్ల్లల్ల వొత్తులేస్కొని సూస్తంటే,
ఇల్లు వొల్లు మస్తు దెబ్బల్తాకి నువ్వొస్తవ్ సూస్తవ్ కాస్తవని ఆసవడ్తుంటె
గనుపట్ల నిల్సుకోని ఇన్నిన్ని ప్రెస్నెలేంది బిడ్డా?
నీ వేలితో నీ కండ్లనె పొడుసుకొనుడు యాడికెల్లి నేర్సినవ్ ?
దినాము కడుపుల ఈ అగ్గిరాజేసుడేంది బిడ్డా?
తట్టుకొనుడు నా వల్లైతలేదు.
మా కడుపులబుట్టిన బిడ్డవే
ఐతెనేం...
ఈడగాక ఆడనే పుట్టిన్నా ఇంతలేసి నొప్పిలేకుంటుండె
మా ఇంట్లబుట్టి గిట్లైనవ్ సూడు...
మస్తు బాదైతాంది, చాతనైతలేదు
ఇట్లైనవేంది బిడ్డా, నీకేమయింది?
- వారణాసి నాగలక్ష్మి,
9490751575