Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం వాయులీనంపై
కమానుగా కవిత్వాన్ని
పెను ఉధృతితో
తుఫానుగా, సునామిగా
సముద్ర గర్జనాసదృశ
దిగంబర కవితాసృష్టి
గావించి
సముద్ర కెరటాల ఆటుపోట్లతో
సమానంగా
మిగిలిన పంచభూతాలను కలుపుకుని
అరిషడ్వర్గాలుగా విస్తరించిన
నగ కవితోద్యమసారథులలో
ఒక దిగ్గజం కూలిపోయింది
స్వేచ్ఛాదిగంబర సంగీతాన్ని
నలుదిశలుగా సాహితీరంగంలో
వ్యాపింపజేసిన
ఒక వయోలిన్ కమాను విరిగిపోయింది
ఇక ఆ తుఫాను ఘోష వినిపించేది
మళ్ళీ ఎప్పుడో? ఎక్కడో
వినిపిస్తుందని నిరీక్షిద్దాం
- తాటికొండాల నరసింహారావు,
9885787250