Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మురికి బొమ్మకెపుడైనా
ప్రాణం పోయ తరమా?
ఒక బొమ్మంత మురికెవరైనా
మోయ తరమా?
తనయుని గుర్తించని
తండ్రెవడైనా ఉంటాడా?
నా ప్రశ్నకు జవాబివ్వండి
దేవుడైతే వాడు
నిరపరాధ బాలున్ని వధిస్తాడా?
అపుడపుడే పుట్టిన శిశువుకి
ఏనుగు తొండమతుకు సాధ్యమా?
గజశీర్షమేసి తాను
మనిషిగా బ్రతుక సాధ్యమా?
జగమున కానరాని
వైద్యమాయెనెటుల?
జంతు శిరము చేర్చిన
చరిత్ర జగములోనెటుల?
మూషికమరకిలో బరువాయె
యాబది బ్రువుకాయంబెట్ల మోయు?
ఆసనంబేసిన సరిగ
మూషికంబు జీవింతునా?
పరమాన్నమోలె కథలల్లి
భగవంతుని పేర నిన్ను మోసగించిరా?
చుక్క నిషానిచ్చి నీకు
నమ్మించి బుద్ధి చూరగొంటిరా?
అమాయక ప్రజలను అంధులు జేసిరని
వారినడుగ తరమా?
మూఢ భక్తితోడ నల్లగుడ్డ కట్టి
మది నుంచి నీవు పారవేయ తరమా?
మరాఠి మూలం : సంత్ గాడ్గే బాబా
- తెలుగు : మహేష్ దుర్గే