Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహౌ ఫాంహౌజు వాసా
ప్రగతిభవను స్థిరనివాసా
తెలంగాణ స్వరాష్ట్ర సాధన తేజో విరాజా
ఈ శిలలపై రాజువై నిలవాలనా
గుడిపైన మంత్రినే తొలచినారూ
మనవాళ్లు దేవునికె నామాలు దిద్దినారూ
ఏ తెలివి లేనట్టివారికైనా
ఒంటిపై కంపరం కలిగించు రీతిగా ||గుడిపైన||
ఒకవైపు జర్రుజర్రున సాగు కారు
ఒక పక్క డెలివరీ కిట్టు చిత్రాలు
ఒక చెంప భువిపైన నడచు దైవతము
ఏకరసమే కారు తెలంగాణ కొచ్చాము
అద్దాలు లేవని చింతపడవలదు
గుడ్డివానికి గూడ స్పష్టమవుతీరు ||గుడిపైన||
ఏక ఛత్రము కింద తెలంగాణ నేలంత
నోరన్నదే లేని జనమంత రోదించ
మూగనోములు ప్రజాప్రతినిధులు వీడుతూ
అన్యాయమక్రమం బని నినాదము చేయగా..
ఇది రాచరికమంటు ఆయనే రాజంటు
స్థపతులకు ఆయనే దేవుడై పోవగా ||గుడిపైన||
రాళ్ళపై చెక్కినా బోళ్ళపైనక్కినా
భవనాలు లేపినా బాటిళ్ళు లేపినా
రాచరికమనుభ్రమలు పొరలెన్ని గప్పినా
ఆ............... అదరని బెదరని జనస్వామ్యముండగా
నీవు ఏ హృదయాన ఎవరికీ ఎప్పుడూ
నిలిచి వుండవు సారూ!
నిజము ఇది బేకారు
- నరుడు