Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గబ్బిలాల రెక్కల్లా
కంటి రెప్పలు
టపటప కొట్టుకుంటున్నాయి
మరచిపోవాలనుకుంటున్న గతం
చీకట్లో కూడా నీడలా
కనబడకుండా వెంటాడుతోంది
కలలు భ్రమలు కలసి
మనసులను
మనుషులను
మైమరపింపజేస్తున్నాయి
వీధి శునకాలు
దారిన పోతున్న దొంగలను చూసినా
మొరలెత్తలేకపోతున్నాయి
నిశ్శబ్దంగా వున్న ఆకాశం మాత్రం
వెలుతురు చుక్కల్ని కంటోంది
- గొట్టిపర్తి యాదగిరిరావు,
8297277795