Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉర్దూ భాషలో గులాబిపువ్వై గుబాళించెను మఖ్దూం
గజల్ సొగసుల బహార్ తానై పసందుచేసెను మఖ్దూం
గుల్ మొహర్లా ప్యార్ గజల్లా ఖుషీలు ఎన్నో చేసి
ముషాయిరాల నవాబులాగ ప్రకాశించెను మఖ్దూం
మైఖాద్ లాగ మత్తెక్కించే షేర్లను మాత్రమే కాదు
ఉడుకెత్తించే నెత్తుటి గీతం తానై వెలిగెను మఖ్దూం
దిగాలు పడుతూ ముందుకు సాగే అనాథ బతుకుల చూసి
కార్మిక నాయక వీరుడు తానై పతాకమెత్తెను మఖ్దూం
చీకటి ముసిరిన తెలంగాణలో 'సుర్ఖ్ సవేర'యై లేచి
దోపిడి బుద్ధుల అరాచకాలకు సమాధికట్టెను మఖ్దూం
మీర్జా గాలిబ్, మహ్మద్ ఇక్బాల్, షాజఫర్ లు కలిసి
తనలో మెరవగ కవితై కురిసి కదిలిసాగేను మఖ్దూం
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682