Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆహ్వానం
డా||దేవులపల్లి రామానుజరావు కళామందిరం పున:ప్రారంభం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో జరుగుతుంది. అనంతరం డా||తిరుమల శ్రీనివాసాచార్యకి డా||కె.ఐ.వరప్రసాదరెడ్డి సాహితీ పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో వి.శ్రీనివాస గౌడ్, డా||కె.ఐ.వరప్రసాదరెడ్డి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా||ముదిగంటి సుజాతారెడ్డి పాల్గొంటారు.
- డా||జె.చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి
మార్చి 1 న వెన్నెల సత్యం 'అమ్మ నానీలు' ఆవిష్కరణ
తెలుగుపూలతోట, తెలంగాణ సాహితి సంయుక్త నిర్వహణలో వెన్నెల సత్యం రచించిన 'అమ్మ నానీలు' ఆవిష్కరణ మార్చి 1వ తేదీ ఉదయం పదిగంటలకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జడ్పీ హైస్కూల్ (కుంటబడి)లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డా||ఎన్. గోపి, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, వల్లభాపురం జనార్ధన, కన్నోజు లక్ష్మీకాంతం, రాపోలు సీతారామరాజు, డా||వి.జయప్రకాశ్ తదితరులు పాల్గొంటారు.
డా|| బెల్లి యాదయ్యకు సన్మానం
ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక Ê నల్లగొండ ఫిల్మ్ సొసైటీ ప్రముఖ కవి, రచయిత డా||బెల్లి యాదయ్యకు మార్చి 8వ తేదీ సన్మానం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో బండి నారాయణస్వామి, డా||కోయీ కోటేశ్వర రావు, మునాసు వెంకట్, ఎం.వి.గోనారెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, చింతల యాదగిరి పాల్గొంటారు.
జాతీయస్థాయి కవితల పోటీలు
సృజనసాహితి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ బాపురం నరహరి రావు పురస్కారం కోసం కవితలను ఆహ్వానిస్తున్నారు. 20 వరుసలకు మించని కవితలను మార్చి 31వ తేదీ లోపు శివేగారి చిన్నికృష్ణ, కాలువపల్లి, ఎంపీ. కొటూరు, పలమనేరు, చిత్తూరు జిల్లా - 517408 చిరునామాకు పంపాలి. ఈమెయిల్ : sivegari@gmail.com.
- శివేగారి చిన్నికృష్ణ, 6300318230
నాన్న కవితలకు ఆహ్వానం
కొత్వాల్ ఆంజనేయులు స్మారకార్థం ముద్రిస్తున్న కవితా సంకలనం కోసం గాఢత, ఆర్ద్రత వున్న కవితలను ఆహ్వానిస్తున్నారు. ఇరవై వరుసలకు మించని కవితలను మార్చి 31వ తేదీ లోపు 9866863913 నెంబరుకు వాట్సాప్ చేయాలి.
- భానుశ్రీ కొత్వాల్
పెన్నా సాహిత్య పురస్కారం - 2020
2020 పెరసం అవార్డు కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 2019 జనవరి నుండి 2019 డిసెంబర్ వరకు ప్రచురితమైన కవితా సంపుటీలను ఆహ్వానిస్తున్నది. ఎంపిక అయిన కవికి పెన్నా రచయితల సంఘం 11 వ వార్షకోత్సవంలో సన్మానం, నగదు పురస్కారం ఇస్తుంది. నాలుగు కాపీలను మార్చి 31లోపు అవ్వారు శ్రీధర్ బాబు, 23 - 1- 57, పెండెం వారి వీధి, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు- 524003 చిరునామాకు పంపాలి. వివరాలకు : 8500130770, 9346393501