Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమైనా జరగొచ్చు
నిద్రలోకి జారుకున్నాక
నా నుదిటి తిలకం బొట్టు
మూడు ముక్కలు కావొచ్చు
కుంభవృష్టి కురవడానికి
సిద్ధంగా ఉన్న మేఘాలు
తెల్లారేసరికల్లా
అభద్రతతో
చెల్లాచెదురై
జాడలేకుండా
అదృశ్యమవచ్చు-
తొలి వెలుగు రేఖలు
ఏ విషాద వార్త మోసుకొచ్చినా
మోసుకు రావచ్చు-
కోటి మంది స్వాగతానికి
అర్రులు చాస్తున్న ఆయన
ఒక్కరు తగ్గినా అలిగి
వెనుదిరిగి వెళ్లి పోనూవచ్చు
ఏమో!
ఏమైనా జరగొచ్చు..!!
ఈ రాత్రి గడిచాక చూడాలి.
- విల్సన్ రావు కొమ్మవరపు,
8985435515