Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ఒక బకాసుర రక్కసి
ఒక చిత్ర విచిత్ర ఘటోత్కజ మాయావి
కావాలి దానికి రోజు బండెడు మనుష్యుల ఆహారం
కరోనా అమానుష దాడితో మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది
దానికి పేద ధనిక తేడాలు లేవు
తనవాడు పరాయివాడు అనే భావాలు రావు
అది హిరణ్యాక్ష రూపం దాల్చింది
భూమండలాన్ని చాప చుడుతుంది
నిజంగానే ప్రపంచాన్ని గ్లోబల్ విల్లేజి చేసింది
అతి పెద్ద తురుంఖానై తరుముతుంది
కోరలు కొమ్ములు లేని అతి సూక్ష్మ రూపంతో
చిత్రమైన మాయావిలా దాడికి సిద్ధమైంది
అప్రమత్తత లేకుంటే నరమేధం చేస్తుంది
ఆలోచన చేయకుంటే సమస్త భూమండలాన్ని భస్మీపటలం చేస్తుంది
అది కనబడని శత్రువులా మాయావిలా యుద్ధం చేస్తుంది
పోరు చేయాల్సింది ఏ పానిపట్టులోనో ఏ కురుక్షేత్రంలోనో కాదు
ఏ ఓరుగల్లు లోనో పోరుగల్లులోనో ఏ వాటర్లులోనో కానే కాదు
ఈ యుద్దానికి ఆయుధాలు అక్కరలేదు
బాంబులు - అనుబాంబులతో పనిలేదు
యుద్ధ విమానాలు రాకెట్లు రాడారుల అవసరం లేదు
అయిసోలేషన్ వార్డుల్లో అహింస పోరాటం చేయాలి
గృహ నిర్బంధంలోనే సత్యాగ్రహానికి తలపడాలి
విల్ పవర్ డోపమైన్తో పోరాడే ''న్యూరాన్లుగా'' మారాలి
సరికొత్త వ్యూహంతో - క్రమశిక్షణతో
వారివారి న్యూరో బయాలోజిని బుల్లెట్ ప్రూఫు చేయాలి
శరీరాల్ని రథాలుగా యుద్ధ సన్నద్ధం చేయాలి
తనువులనే ప్రకృతిసిద్ధ దుకాణులుగా మార్చాలి
ఎవరికివారే గాంధీ కరంచందులా గృహనిర్బంధం కొనసాగిస్తూ -
అహింసా సత్యాగ్రహం దీక్షలతోనే యుద్దానికి తలపడాలి
ఈ అపూర్వ పద్మవ్యుహాన్ని చేదించ చేతకాక
కరోనా రక్కసి తిక్కతిరిగి పడిపోతుంది మాయావి అంతమౌతుంది
- గులాబీల మల్లారెడ్డి 9440041351