Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కానీ ఏదో తెలియని పరాయితనం
జానెడు పొట్ట కోసం
ఊరు కాని ఊర్లో అర్థం కాని భాషతో
కుస్తీ పడుతూ రూపం లేని
వింత ఆకారాలుగా ఉంటారు...
ఊపిరాడక చావైనా, బతుకైనా
సొంతూర్లోనే అన్న మొండితనం
గమ్యం లేని దారిలో నడిపిస్తుంది
లాక్డౌన్లు, పోలీసు వలయాలు ఇట్టే దాటినా
ఆకలి ముందు ఓటమే మిగులుతుంది
వాళ్ళ శవమే ఊరు చేరుతుంది
ఎక్కడ్నుండో వాళ్ళ మీద
'సానుభూతి' పవనాలు వీస్తాయి,
వాళ్ళ మరణవార్త న్యూస్ ఛానళ్లకు
టీఆర్పి సాధనమవుతుంది,
ట్విట్టర్లో వాళ్ళ మరణమే ట్రెండింగ్‌గా మారుతుంది,
మానవత్వమే కాదు సానుభూతీ
తన రూపాన్ని మార్చుకుంది మరి!
ఎప్పుడూ ఏడిచే కళ్ళల్లో ఏదో ఒకరోజు
కన్నీటికి బదులు ఖడ్గాలు మొలుస్తాయి,
ప్రశ్నించే సముద్రాలు ఉప్పెనలయి ఉప్పొంగుతాయి
'సానుభూతి కోసం కాదు
హక్కుల కోసం పోరాడే గొంతుకలు వెర్రెత్తి అరుస్తాయి'..
- వేణుమాధవ్