Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంపర తూటాలకు
వణికి పోతున్న ఊపిరితిత్తులు
సరిహద్దులు లేని ప్రపంచీకరణకు
నియంత్రణ గోడలు
కాలంతో పోటీ పడే మనిషికి
క్వారంటైన్ సంకెళ్ళు
ప్రతి నోటా కరోనా మాట
ఎంతటి అధునాతన ఆయుధాలైనా
చేయవు కరోనా పొర విస్పోటనం
మందులకు లొంగని మహమ్మారి
ప్రశ్నిస్తోంది మానవ మనుగడను
సవాలు చేస్తోంది శాస్త్రజ్ఞులను
పరీక్షిస్తున్నది రోగనిరోధకతను
విశ్వ క్రీడా విహారియై
ధరిస్తున్నది మత్యు కిరీటాలను
అయినా కరోనాతో కంగారెందుకు
సెన్సెక్స్ సూచీల లాభ నస్టాలు
అతివష్టి - అనావష్టులు
ఆర్థిక అస్తవ్యస్తాలు
అంటు రోగాలు - వింత జబ్బులు
మనకేవీ కొత్త కాదు,
శాశ్వతమూ కాదు
మసలుకో స్థితి గతులను బట్టి
ఆలోచించు ధైర్య సాహసాలతో
జీవన చదరంగం గెలుపు కోసం
వేసేరు ఎత్తుకు పై ఎత్తు
శతకోటి వైరస్లకు
అనంతకోటి ఉపాయాల మందులు
అధైర్యాన్ని పక్కన పెట్టి
ఆలోచించు
కరోనా ధ్వంస రచనకు
కొత్త జీవన గమనంలో
బతకడానికి
బతికించడానికి
మార్పు చేర్పులతో
ఎగరవేయి విజయ బావుటా.
- కంజర్ల విజయలక్ష్మి